పెరటి వైద్యం | వ్యాధి | కథనాలు | చిట్కాలు | హోమియోపతి | దాంపత్యం | మనస్తత్వ శాస్త్రం | వార్తలు | యోగాసనాలు | ఆయుర్వేదం | స్వైన్ ఫ్లూ
ప్రధాన పేజి » ఇతరాలు » ఆరోగ్యం » వార్తలు » 'హాస్పిటల్ ఆన్ వీల్స్‌'‌ను ప్రవేశపెట్టిన జీకేఎం హాస్పిటల్ (Gkm Hospital | Hospital on Wheels | Kartik Mukesh | Chennai)
తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నయ్ కేంద్రంగా వైద్యసేవలు అందిస్తున్న జీకేఎం హాస్పిటల్ ప్రైవేట్ లిమిటెడ్ చెన్నపురి నగరవాసుల కోసం హాస్పిటల్ ఆన్ వీల్స్‌ సర్వీసును ప్రారంభించింది. నగరంతో పాటు చెన్నయ్ శివారు ప్రాంతాల్లో నివశిస్తున్న ప్రజల సౌకర్యార్థం ఈ తరహా వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చినట్టు జీకేఎం హాస్పిటల్ మేనేజింగ్ డైరక్టర్ డాక్టర్ కార్తీక్ ముఖేష్ వెల్లడించారు.

హాస్పిటల్స్ ఆన్ వీల్స్ ప్రారంభోత్సవ కార్యక్రమం అనంతరం ఆయన చెన్నయ్‌లో విలేకరులతో మాట్లాడుతూ... ఈ సర్వీసు 365 రోజుల పాటు అందుబాటులో ఉంటాయన్నారు. ఈ వాహనంలో పూర్తి శిక్షణ పొందిన వైద్యుడు, నర్సు, అసిస్టెంట్ బృందంతో పాటు.. అత్యవసర చికిత్స (ఐసీయు)కు అవసరమైన మందులు ఉంటాయన్నారు.

ఉన్నట్టుండి అనారోగ్యానికి గురయ్యే రోగులకు అత్యవసరంగా వైద్యసేవలు అందించేందుకు అవసరమైన పూర్తి సామాగ్రి, మందులు ఇందులో ఉంటాయన్నారు. అనారోగ్యానికి గురైన రోగి కోరుకున్న విధంగా ఆ రోగి నివశించే ఐదు కిలోమీటర్ల పరిధిలోని ఆస్పత్రికి తరలిస్తామన్నారు. ఇందుకోసం రూ.1500 మాత్రమే వసూలు చేస్తామన్నారు.

రోగి అనారోగ్యానికి గురైనపుడు.. ఆ రోగి ప్రాణాలు కాపాడేందుకు ఆస్పత్రికి తరలించే సమయాన్ని 'గోల్డెన్ అవర్'గా భావిస్తారన్నారు. ఈ తరలించే సమయంలోపు రోగికి కావాల్సిన వైద్య చికిత్స చేసి రోగి ప్రాణాలు కాపాడేందుకు హాస్పిటల్ ఆన్ వీల్స్ ఎంతో దోహదపడుతుందన్నారు. ఉదాహరణకు గుండెపోటు, గుండె నొప్పితో బాధపడే వారిని, రోడ్డు ప్రమాదాల్లో గాయపడేవారికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుందన్నారు.

ఈ తరహా సర్వీసును చెన్నయ్ నగరంలో అందుబాటులోకి తీసుకుని రావడం ఇదే తొలిసారని చెప్పారు. సాధారణంగా అన్ని ప్రధాన ఆస్పత్రులు ఆంబులెన్స్ సర్వీసులను అందుబాటులో ఉంచగా, తాము ఒక అడుగు ముందుకేసి హాస్పిటల్ ఆన్ వీల్స్‌ సర్వీసును ప్రారంభిచినట్టు ఆయన వివరించారు. పూర్తి వివరాలు కోసం 25324444 వేగా 43903333 అనే ఫోన్ నంబర్లలో సంప్రదించవచ్చని కార్తీక్ తెలిపారు.
సంబంధిత సమాచారం
Feedback Print