సూర్యరశ్మి లోపం వివిధ క్యాన్సర్లకు దారితీస్తోందని లండన్ శాస్త్రవేత్తల అధ్యయనం వెల్లడించింది. చర్మ క్యాన్సర్ సహా 15 రకాల క్యాన్సర్లు సూర్యరశ్మి లోపంతోనే వస్తాయని తెలిపింది. "యాంటీ క్యాన్సర్ రీసెర్చ్" జర్నల్‌లో ముద్రించిన కథనం మేరకు, దాదాపు 100 దేశాల్లో వ్యక్తులపై శాస్త్రవేత్తలు పరిశోధనలు జరిపారు.
సూర్యుడి నుంచి వచ్చే అల్ట్రావైలెట్ రేడియేషన్ ద్వారా లభ్యమయ్యే విటమిన్ 'డి ' క్యాన్సర్‌ను అరికడుతున్నట్లు తెలిపారు. అయితే, సూర్యరశ్మి సమపాళ్ళలో అందని వ్యక్తులు క్యాన్సర్‌కు త్వరితంగా గురవుతున్నారని హెచ్చరించారు.
ప్రస్తుత జీవన విధానం మనిషిని సూర్యరశ్మి నుంచి దూరం చేస్తోందని, గదుల్లోనే ఉద్యోగ వ్యాపారాల విధులు నడుస్తున్నందున కావలసిన పాళ్ళలో 'డి ' విటమిన్ అందడం లేదని వారు పేర్కొన్నారు. కనుక శరీరాన్ని సూర్యరశ్మికి తగిలించాలని వారు చెపుతున్నారు.