ప్రధాన పేజి > ఇతరాలు > ఆరోగ్యం > మనస్తత్వ శాస్త్రం > చేసిన తప్పులతోనే మానసిక ఒత్తిడి
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
చేసిన తప్పులతోనే మానసిక ఒత్తిడి
కొంతమంది ప్రతీ చిన్న విషయానికి మానసిక ఒత్తిడికి గురవుతారు. ఇది పలు సందర్భాలలో జరుగుతుంది. నిరుత్సాహా పరిచే అంశాలు విన్నప్పుడు కూడా కావచ్చు. దైనందిన జీవితంలో జరిగే చిన్న చిన్న తప్పులకు కూడా కొందరు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతారు. మానసిక ఒత్తిడికి గురయినప్పుడు మెదడులో జరిగే మార్పులపై ఎప్పటి నుంచో పరిశోధనలు జరుగుతున్నాయి. అందులో శాస్త్రవేత్తలు కొంత పురోగతి సాధించారు.

మాంచెస్టర్ విశ్వవిద్యాలయానికి చెందిన మానసిశాస్త్ర విభాగానికి చెందిన మానసిక వైద్య నిపుణులు డాక్టర్ రోనాల్డ్ జాన్ తన సహచరులతో కలసి పరిశోధనలు నిర్వహించారు. మనిషి మానసిక ఒత్తిడికి ఎలా గురవుతున్నారనే అంశాన్ని చాలా క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ పరిశీలనలో చాలా అంశాలు వెలుగు చూశాయి. మానసిక ఒత్తిడికి మెదడుకు ఉన్న సంబంధాలపై పరిశోధన చేశారు.

నైతిక నమ్మకాలతో కూడిన సామాజిక వ్యవహారశైలి, గర్వం, తప్పు జరిగినప్పుడు మెదడు స్పందిస్తోంది. ఈ స్పందనతో మనిషిలో ప్రవర్తనలో మార్పు కనిపిస్తుంది. ఈ సంఘర్షణే మానసిక ఒత్తిడి అంటారు. దాదాపుగా 29 మందిపై పరిశోధన జరిపారు. ఇందుకోసం ఎఫ్ఎంఆర్ఐ ద్వారా మెదడులను పరిశీలించారు.
1 | 2  >>  
మరిన్ని
నలభై దాటితే అన్ని ఆందోళనలే...
రోమాలెందుకు నిక్కబొడుచుకుంటాయి...?
ఆత్మహత్య వెనుక రహస్యాలు..
ఆత్మహత్య లేఖ'లో కారణాలు చెప్పేది మగవారే
మరీ అంత బిడియమైతే ఎలా...?
పెద్దల పోట్లాట: పసి హృదయాలపై చెరగని ముద్ర