మనిషి జీవితంలో తీవ్రమైన ఒత్తిడికి గురయ్యే దశ ఏదంటే టీనేజ్ అని టక్కున చెప్పేయవచ్చు. ఈ వయస్సులో ఉన్న పిల్లలు ఇటు శరీరంపైనా, అటు మానసికంగానూ తీవ్రమైన ఒత్తిడి పడుతుంది. శరీరంలో మార్పులు ఇందుకు ప్రధాన కారణమవుతాయి. ఈ వయస్సులో ఉన్న పిల్లల భావాలు కనుక్కోవాలన్నా చాలా ఇబ్బందికర పరిస్థితే.
దీనిపై మానసిక శాస్త్ర పరిశోధకులు చేస్తున్న ప్రయత్నాలు ఫలించినట్లున్నాయి. మామూలుగా పిల్లలు 13 యేళ్ళ వయస్సులో అడుగు పెట్టారంటే ఆవేశపూరిత భావాలు ఎక్కువగానో, తక్కువగానో కనిపిస్తాయి. వాటిని కనుక్కోవడం కాస్త కష్టమేననిపిస్తుంది. ఈ విధమైన భావాలు 13 యేళ్ళ ప్రాంతంలో ఆరంభమవుతాయి.
16 నుంచి 24 యేళ్ళ వరకూ పెరుగుతూ వస్తాయి. అయితే వీటిని అంచనా వేయడం కష్టం. ఎప్పుడు హుషారుగా ఉంటారో, ఎప్పుడు ఢీలా పడుతారో తెలియని స్థితి. ఇందులో సగం మంది టీనేజర్లు మానసిక ఒత్తిడికి గురవుతున్నావారే కావడం విశేషం. ఈ విధంగా ఉన్నవారిలో ఆందోళన, అత్రుత, నిరసన, తిరస్కారణ ధోరణి వ్యవహరిస్తారు. వీటిని కనుక్కోవడం చాలా కష్టం.
హార్వార్డ్ మెంటల్ హెల్త్ లెటర్ ఎడిటర్ డాక్టర్ మైఖెల్ మిల్లర్ వీటిని విశదీకరించారు. ప్రవర్తన భావాలు, ఆలోచనా తీరును అనుసరించి వారి మానసిక స్థితిని, వారి తోవను అంచనా వేయవచ్చునని తన వ్యాసంలో తెలిపారు. పిల్లలకు సంబంధించిన అంశాలన్నీ ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి.
తప్పుడు ప్రవర్తనగానీ, రెండు వారాలు నుంచీ లేదా అంతకంటే ముందు నుంచి ఎటువంటి అంతరం లేకుండా ఇదే ప్రవర్తన ఉంటే అవి వారిలోని మానసిక ఒత్తిడికి చిహ్నాలుగా భావించవచ్చు. పిల్లలు ఆడుకునే ప్రాంతాలు, స్నేహితులతో సంభాషణల సమయంలోనూ, చదువుకునే ప్రాంతాల్లో ఎదురయ్యే సమస్యలు మనం కనుక్కుంటూ ఉండాలి. ఇది వారి మానసిక ఒత్తిడిని పెంచుతోందనే చెప్పాలి.
|