తెలివైన వాడు కాబట్టే.. ఏమి మాట్లాడలేదు. వెళ్ళిపోయాడు... తెలివైన వాడురా అందుకే చాలా ఓపికగా ఉండిపోయాడు అని అంటుండడం వినిపిస్తుటుంది. ఈ ప్రవర్తనకు అందరికీ ఆర్థంతెలియదు. విపత్కర, ఉద్వేగ పరిస్థితులలో ఓపికగా ఉంటారు. దీనినే సంయమనం అటారు. ఇది తెలివైన వారి సొంతం.. వారే ఎక్కువగా సంయమనం పాటిస్తారు ఎందుకు ?
దీనిపై యేల్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు సంయమనంపై కసరత్తులు చేశారు. ఇందుకు సంబంధించి మెదడులోని నిర్మాణం స్పందించే తీరును మానసికవైద్య నిపుణులు చెబుతున్నారు. దాదాపుగా 103 మందిపై పరిశోధనలు జరిపారు. వారిపై విచిత్రమైన పరిశీలనలు జరిపారు.
నగదు అవార్డులు తీసుకున్నపుడు వారు స్పందించే తీరును గమనించారు. విపత్కర సమయాలలో వారు వ్యవహరించే తీరును పరిశీలించారు. వారి జ్ఞాపక శక్తిపై పరీక్షలు జరిపారు. ఎఫ్ఎంఆర్ఐను వినియోగించి మెదడు ప్రక్రియలను గమనించారు. టీరియర్ ప్రీఫ్రంటల్ కార్టెక్స్‌లో జరుగుతున్న మార్పులను గమనించారు.
నగదు ఆవార్డును తీసుకునేటప్పుడు చాలా సంయమనాన్ని పాటిస్తున్నట్లు తెలిపారు. అహంభావిత సమస్యలను పరిష్కరించడంలోనే కాకుండా ఎక్కువ తెలితేటలు ప్రదర్శించడంలో యాంటీరియర్ ప్రీఫ్రంటల్ కార్టెక్స్ మనిషికి సహాయపడుతుంది. లక్ష్యసాధన, సంయమన పాటించడంలో ఇది ప్రముఖ పాత్ర వహిస్తుంది.
జ్ఞానం అనేది స్వల్పకాలిక జ్ఞాపకశక్తి, తెలివితేటలలో దాగి ఉంటుందని గుర్తించారు. ఇది సంయనం పాటించడం, ప్రవర్తనను నియంత్రించడానికి ఉపయోగపడుతుంది. ఎదుటి వారిని తొందరపడి దూషించకుండా ఉండడాన్ని కూడా నియంత్రిస్తుంది. పరిస్థితులను అవగతం చేసుకోవడం అనేది సంయమనానికి సహాయపడతాయి.
|