ప్రధాన పేజి > ఇతరాలు > ఆరోగ్యం > మనస్తత్వ శాస్త్రం > కంటికి కనిపించని శత్రువు ఒంటరితనం
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
కంటికి కనిపించని శత్రువు ఒంటరితనం
ఒంటరితనం మనిషిని విపరీతంగా వేధించే ఓ సమస్య. ఈ సమస్య తలెత్తితే మనిషి మానసికంగా ఎంతో దీనస్థితికి చేరుకుంటాడు. నిరంతరం తనలో తానే కుమిలిపోతూ బాహ్య ప్రపంచాన్ని గురించి పట్టించుకోకుండా గడిపేస్తుంటాడు. చుట్టూ ఎందరు ఉన్నా తనకంటూ ఎవరూలేరని మనసు వేధిస్తుంటే ఇక ఆ మనిషి అంతరంగం ఎంత వేధనాభరితంగా మారుతుందో ఊహించడం కష్టం.

మెదడును పురుగులా తొలిచేసే ఈ ఒంటరితనం నుంచి మనిషి వీలైనంత త్వరగా బయటపడకపోతే అది ఆ మనిషి జీవితాన్నే మొత్తంగా ప్రభావితం చేసే అవకాశముందని మానసిక శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. మరి ఒంటరితనం అనే సమస్య నుంచి బయటపడి అందరిలా చలాకీగా జీవించాలంటే ఏం చేయాలి... అందుకు మార్గం లేకపోలేదు.
ఒంటరితనాన్ని జయించే ప్రయత్నం చేయాలి
  నిజంగానే ఎవరూ లేనపుడు ఒంటరితనం గురించి బాధపడేవారికి స్నేహితులో, బంధువులో దగ్గరకు తీసుకోగల్గితే వారి సమస్య పరిష్కారమైనట్టే. కానీ అందరూ ఉన్నా ఒంటరిగా భావించేవారి విషయంలో మాత్రం అందుకు గల మూల కారణాన్ని తెలుసుకోవడం చాలా ముఖ్యం.       


అసలు మనలో ఒంటరితనం అనే భావన ఎందుకు వచ్చింది అనే విషయాన్ని ఖచ్చితంగా నిర్ధారించగల్గితే ఒంటరితనంపై మనం విజయం సాధించినట్టే. అసలు ఒంటరితనం అనేది మనిషిలో రెండు రకాలుగా ఉంటుందనేది మనో వైజ్ఞానికుల భావన. తనకంటూ ఏ బంధుత్వాలు లేక ఒంటరివాడిగా ఉన్నామని బాధపడేవారు కొందరైతే అందరూ ఉన్నా మానసికంగా తమని తాము ఒంటరిగా ఊహించుకునేవారు మరికొందరు.

ఈ ఇద్దరిలో రెండోవారిదే అసలైన సమస్య. నిజంగానే ఎవరూ లేనపుడు ఒంటరితనం గురించి బాధపడేవారికి స్నేహితులో, బంధువులో దగ్గరకు తీసుకోగల్గితే వారి సమస్య పరిష్కారమైనట్టే. కానీ అందరూ ఉన్నా ఒంటరిగా భావించేవారి విషయంలో మాత్రం అందుకు గల మూల కారణాన్ని తెలుసుకోవడం చాలా ముఖ్యం.

1 | 2  >>  
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
అతని వల్లే నేను నాశనమయ్యా... చింతన వద్దు
రాత్రి 10 గంటల తరువాతే సృజనాత్మకత..!!
పగటి కలల లోకంలో విహరిస్తున్నారా...?
సంయమనం తెలివారి సొంతమే... ఎందుకు ?
మానసిక గాయానికి చికిత్స లేదు
టీనేజర్ల భావోద్రేకాలను గుర్తించడమెలా....?