ప్రధాన పేజి > ఇతరాలు > ఆరోగ్యం > మనస్తత్వ శాస్త్రం > హోమోసెక్సువల్ టెండెన్సీతో బాధపడుతున్నారా!
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
హోమోసెక్సువల్ టెండెన్సీతో బాధపడుతున్నారా!
మీరు హోమోసెక్సువల్ టెండెన్సీతో బాధపడుతుంటే అది విపరీతమైన ఆలోచనా విధానమే. మనిషి పుట్టి పెరిగేటప్పుడు తను ఏ సొసైటీలోనున్నది అర్థం చేసుకుంటాడు. అలాగే ఆ సొసైటీ ద్వారా ఏది మంచిది, ఏది చెడు అన్న విచక్షణా జ్ఞానం నేర్చుకుంటాడు మనిషి. తను పెరిగిన ఇల్లు, తల్లిదండ్రులు, స్నేహితులు, పాఠశాల, బంధువులు తదితరాల వంటి వాతావరణంతో మానసిక, శారీరక వికాసం జరుగుతుందని మానసిక వైద్యనిపుణులు పేర్కొన్నారు.

ఇక్కడ చేప్పుకోవాల్సిన విషయమేంటంటే ప్రస్తుతం ఇలా బాధ పడుతున్నవారి సంఖ్య అంచనాలకు మించే వుందంటున్నారు పరిశోధకులు. వీరిలో మొదట్లో ఏదో కొత్త కొత్తగా వుందని హోమోసెక్స్‌కు అలవాటు పడిన తర్వాత మళ్లీ మామూలు జీవితం అంటే అందరిలాగే పెళ్ళి చేసుకుని పిల్లల్ని కనాలన్న కోరికవుందని అత్యధిక సంఖ్యాకులు అభిప్రాయపడుతున్నారు.

మనిషి యొక్క మానసిక వికాసం జరిగే క్రమంలో కొన్ని లోపాలు ఏర్పడితే వాటిని డెవలప్మెంటల్ డిజార్డర్స్ అంటారు. ఇది మన సామాజిక పరిస్థితులకు ఆమోద యోగ్యం కాదు. కాబట్టి తప్పకుండా మీలోని ఆలోచనను మానుకోవాలి.

అలా మార్చుకోవడానికి సైకియాట్రిస్ట్, సెక్స్ కౌన్సిలర్స్ సలహాలను తీసుకోండి. క్రమం తప్పకుండా ఆరు నెలలనుంచి ఒక సంవత్సరంవరకు వారి పర్యవేక్షణలోనే చికిత్స తీసుకోవలసివుంటుంది. అప్పుడు మీరు మీ అవగాహనా దృష్టిని, ధోరణిని మార్చుకుని నిదానంగా మీ సమస్యను పరిష్కరించుకోవచ్చును.

ఈ సమస్యకు మాత్రలు, టానిక్కులు పని చేయవంటున్నారు వైద్యులు. ఇలాంటివారికి క్రమం తప్పకుండా చికిత్స, కౌన్సిలింగ్ తీసుకున్న ఇలాంటి వారు చాలామంది ప్రస్తుతం మారిపోయి సుఖవంతమైన సంసార జీవితాన్ని గడుపుతున్నారు.

కాని మళ్లీ తాము వైవాహిక జీవితానికి పనికి వస్తామా లేదా అనేది వారిలోని అనుమానం. ఆ అనుమానమే పెనుభూతమై వారిని మానసికంగా క్షోభకు గురిచేస్తుందని పరిశోధకులు అభిప్రాయపడ్డారు. కాని ఇలాంటివారికి సైకియాట్రిస్ట్, సెక్స్ కౌన్సిలర్‌ల సలహాలు ఎంతో లాభాదాయకం కాగలదని వారు పేర్కొన్నారు.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
ఏడువు... బాగా ఏడువు
కష్టాలు మనుషులకు కాక మానులకొస్తాయా...
నమ్మకమే సంబంధాలకు మూలం
టీనేజ్‌లో తోడుకావాలి...
నిత్యం సానుకూల దృక్పథంతోనే ఆలోచించండి
"ఆనందం" పంచేకొద్దీ పెరుగుతుంది