ఈ ఆధునిక ప్రపంచంలో పనుల గజిబిజి. ఉరుకులు-పరుగులతో జీవితం ముడిపడివుంది. కారణం ఏదైనాకూడా ఒత్తిడికి గురవడం జరుగుతుంది. ఈ ఒత్తిడినుంచి(డిప్రెషన్) దూరంకావటానికి మందులు వాడేదానికన్నాకూడా వ్యాయామం చేయడం చాలా మంచిదంటున్నారు వైద్యులు. వ్యాయామం కోసం ప్రతి రోజూ కనీసం 30నిమిషాలను కేటాయించాలి, కనీసం ఐదు రోజులపాటు వ్యాయమం చేయాలి. ఎప్పుడు వీలు దొరికినా 15 నిమిషాలపాటు వ్యాయామం చేస్తే శరీరంలో మార్పు మొదలవుతుంది.వ్యాయామం జీవితానికి ఒక క్రమశిక్షణ తెస్తుంది. ప్రతి రోజు ఒక ప్రత్యేక సమయానికి వ్యాయామం, నిద్ర అలవాటైతే మనిషి ఆలోచనలు వ్యతిరేకపరమైనవిగాకాక మంచి ఆలోచనలు పుట్టుకువస్తాయంటున్నారు పరిశీలకులు. వ్యాయామం చేయడం వలన శరీరం బరువు తగ్గుతుందని, దీనివలన కొత్త స్నేహాలు, సూచనలు, మూడ్‌ను మారుస్తుందని వారు పేర్కొన్నారు. వ్యాయామం చేయడం వలన ఎండార్ఫిన్‌లు విడుదలవుతాయి. ఎండార్ఫిన్‌లు మనిషియొక్క మూడ్‌ను మార్చి జీవ రసాయనాలను ఉత్పత్తి చేస్తాయి. ఈ జీవ రసాయనాలు ఒత్తిడిని పారద్రోలి, కొత్త శక్తిని నింపుతుంది. ఒత్తిడికి గురైనవారిలో 80శాతం మంది నిద్రలేమితో బాధపడుతుంటారని వైద్యులు తెలిపారు. ఇదే ఒత్తిడికి గురైనవారు వ్యాయామం చేస్తే నిద్రలేమి సమస్య పూర్తిగా తగ్గి చలాకీగా వుంటారని వైద్యులు సూచించారు. |