మనిషి తను కోరుకున్న వారిని ప్రేమిస్తుంటాడు. ఆ ప్రేమ కోసం పడే పాట్లు అన్నీ-ఇన్నీ కావు. అప్పుడు చాలా ఒత్తిడికి(టెన్షన్) గురవుతుంటారు. అలాగే అదే ప్రేమను పొందినాకకూడా ఒత్తిడికి లోనవుతుంటారు. ఓ ప్రముఖ వ్యక్తి చెప్పినట్లు ప్రేమ టెన్షన్‌ను పుట్టిస్తే, ఆ టెన్షన్‌ను దూరం చేసేది రతిక్రియ అని ఆయన తెలిపారు. అందునా పెళ్ళి అనే వివేకంపై మూర్ఖత్వం గెలుపులా ఉంటుందిది. ఈ విషయంలో మన దేశం ఎటువైపు?రతిక్రియకు వాడే కండోమ్‌లను తయారు చేసే ప్రముఖ కంపెనీ కామసూత్ర భారత దేశంలో ఓ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో దాదాపు పది పెద్ద నగరాల్లో నివసించేవారు మూడు వేలమంది పాల్గొన్నారు. ఇందులో తెలిసిన అంశాలు ఏంటంటే...నలభై శాతంకు పైగా ప్రజలు వారి వివాహానికి ముందు రతిక్రియలో పాల్గొన్నారట!ఇది మంచి పద్ధతేనా ! మేం చెప్పొచ్చేదేంటంటే... భారతదేశం పల్లెలకు పట్టుకొమ్మలు. అలాంటి వాటిలో ఇలా జరగవనేది నిర్వివాదాంశం. ఇలా చేయడంకూడా పొరబాటేనంటున్నారు పెద్దలు.ఇంకా చెప్పాలంటే మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అని ఇంగ్లీషులో సామెత ఒకటి ఉంది. రహస్యం గురించి, మనోవిజ్ఞానం గురించి తెలిసినవారు దీనిని నమ్మరు. పెండ్లి అనేది ఓ లడ్డు లాంటిది. దీనిని తినేవారు, తినని వారుకూడా బాధపడుతుంటారు. తెలివైన వారు ఇలాంటి సామెతలపై నమ్మకాలుంచుకుంటారు.ప్రేమ అనేది ఒక జబ్బులాంటిది...ప్రేమ అనేది ఒక జబ్బులాంటిదని కొంతమంది డాక్టర్ల పరిశోధనల్లో తేలినట్లు పేర్కొన్నారు. ఈ జబ్బుకు మందు అనేది కేవలం రత్రిక్రియ మాత్రమేనని వారి పరిశోధనల్లో తేలినట్లు పరిశోధకులు తెలిపారు. సరైన ప్రేమ లభించకపోతే శరీరంలో జబ్బులు అధికమవుతాయని, దీంతో కోపం, ఇతర మానసిక జబ్బులు పుట్టుకొస్సతాయని వారు పేర్కొన్నారు. దీనిని లవ్ సిక్‌నెస్ అంటారని వారు తెలిపారు. మీరా శ్రీకృష్ణుడిని అమితంగా ప్రేమించింది. ఆమె ప్రేమ స్వచ్ఛమైనది. ఇందులో కామానికి తావులేదు. ప్రస్తుతం సమాజంలో నిజమైన ప్రేమగురించి ఆలోచించేవారు అరుదు. ప్రేమ, నమ్మకం అనేది దంపతులమధ్య కొనసాగే బంధం. ఇది వారి దాంపత్య జీవితంలో ప్రేమకు రతిక్రియకు ఏమాత్రం సంబంధం ఉండదు. కేవలం అక్కడ ప్రేమే రాజ్యమేలుతుంది. సరే ఇక్కడ మనం మాట్లాడుకునే విషయం ఏంటంటే...ప్రేమగురించి. కాబట్టి పరిశోధకుల మాటేంటంటే...ప్రేమలో తొలుత ఒత్తిడి(టెన్షన్) ఉంటుంది. అదే కొద్ది రోజులైన తర్వాత జీవితం సాఫీగానే సాగుతుంది. కాని మెలమెల్లగా టెన్షన్ మొదలవుతుందంటున్నారు వారు. ఇందులో చెడు ప్రవర్తనకు దారి తీస్తుందంటున్నారు పరిశోధకులు. ఒకవేళ ప్రేమలో చెడుప్రవర్తనను ఎదుర్కోవాల్సివస్తే హృద్రోగం బారిన పడక తప్పదని వారంటున్నారు. దీంతో మీలోనున్న ప్రేమ ఎంతమాత్రం నిజమనే విషయం తేలుతుందంటున్నారు పరిశోధకులు. కాని పరిశోధకులు చెప్పినంత మాత్రాన మనం ప్రేమను కేవలం రతిక్రియకు సంబంధించినదిగా గుర్తించలేం. రతిక్రియ అనేది కేవలం అది శారీరికమైన సమస్య. కాని ప్రేమ అనేది అనిర్వచనీయమైన అనుభూతి. దీనిని ఎవ్వరూకూడా ఏమాత్రం తీసేయలేరు. కాని నిజమైన ప్రేమ ఎక్కడ ఉందనేది ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాలుగా ప్రేమ అనే ముసుగులో కామం కళ్ళకు గంతలు కట్టి చాలామంది యువకులు అమ్మాయిలను వేధించి మరీ తమ అభిప్రాయాలను తెలిపి వారిని నానా హింసలకు గురి చేస్తున్నారు. దీంతో వారిలో నిజంగానే ప్రేమ ఉన్నట్లా...! |