ప్రధాన పేజి > ఇతరాలు > ఆరోగ్యం > మనస్తత్వ శాస్త్రం > కించిత్ మధుపానంకూడా కష్టమే...!
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
కించిత్ మధుపానంకూడా కష్టమే...!
సహజంగా చాలామంది తాము తీసుకునే మద్యం అతి తక్కువని, అదికూడా ఎప్పుడో ఒకప్పుడేనని, దీనివలన తమకు ఏమంత హాని కలగదని అనుకుంటుంటారు. కాని ఆరోగ్యానికి ఇది చాలా ప్రమాదమని పరిశోధకులు తెలిపారు.

అతి తక్కువగా మద్యం తీసుకోవడంకూడా ఆరోగ్యానికి హానికరమని, ఇది మనిషి మస్తిష్కంపై తీవ్రమైన దుష్ప్రభావం చూపిస్తుందని పరిశోధనలో తేలినట్లు పీటర్స్‌బర్గ్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధనకారులు తెలిపారు.

ఉదాహరణకు వాహనాలను నడిపేవారకి మద్యం తీసుకోవడం చాలా ప్రమాదకరం, ఎందుకంటే వారి శరీరంపై వారికే నియంత్రణ ఉండదు. వారేం చేస్తున్నారనేది వారికే గుర్తుండదంటున్నారు పరిశోధకులు. మద్యపానం తీసుకున్న తర్వాత వారు ఏం చేస్తున్నారనేది వారికే తెలియని స్థితిలో ఉంటారు.

పీటర్స్ బర్గ్ కు చెందిన మానసిక శాస్త్రానికి చెందిన ప్రొఫెసర్ మైకేల్ సాయెట్టీ, కాలిఫోర్నియా విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ ఎరిక్ రీచల్, జోనాథన్ స్కాలర్‌లు కలిసి ప్రత్యేకంగా పురుషులపై పరిశేధనలు జరిపినారు. వీరిలో సగం మందికి మద్యం ఇచ్చారు.

మద్యం తీసుకున్న ముఫై నిమిషాల తర్వాత వారిని కంప్యూటర్స్ స్క్రీన్‌పై "వార్ అండ్ పీస్" కు సంబంధించిన అంశాన్ని చదవమని చెప్పడం జరిగింది. వారిపై జరిపిన పరిశోధనల్లో తెలిసిన విషయం ఏంటంటే మద్యపానం తీసుకున్న వారిలో తాము చదివిన విషయం ఏ మాత్రం గుర్తుండలేదు సరికదా... వారిలో మానసికమైన ఒత్తిడి అధికమైనట్లు తమ పరిశోధనల్లో తేలినట్లు మానసిక శాస్త్రవేత్తలు తెలిపారు.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
సంతోషంగా ఉండండి...ఆయుష్షు పెంచుకోండి
ప్రేమ ఒత్తిడిని పెంచుతుంది !
ఒత్తిడి అధికంగావుందా...!
కలలు... చెడ్డకలలు... అందమైన కలలు...!
ఏకాకితనం ప్రమాదకరం
విషాదమా.? అయితేనేం.. ఆరోగ్యానికి మంచిదే..!