ప్రధాన పేజి   ఇతరాలు > ఆరోగ్యం > దాంపత్యం
 
స్మోకింగ్‌తో సెక్స్ కోరికలు తగ్గుతాయా?
Couple
FILE
స్మోకింగ్ చేయటం వల్ల సెక్స్ కోరికలు తగ్గిపోతాయా... అని పొగతాగేవారిలో చాలామంది వైద్యులను అడిగే ప్రశ్న. అయితే పొగతాగేవారిలో సెక్స్ కోరిక ఎంతమాత్రం తగ్గదంటున్నారు వైద్యులు. సెక్స్‌పై స్మోకింగ్ ప్రభావం ఎలా ఉన్నప్పటికీ ఆరోగ్యం మీద దుష్ఫలితాలు ఎక్కువగా కనబడతాయి.

స్మోకింగ్ చేయటం వల్ల గుండెపోటు రావటం, కడుపులో పుళ్లు ఏర్పడటం, బ్రోంఖైటిస్ వంటి వ్యాధులతో ఇబ్బందిపడటం, లంగ్ కేన్సర్ వంటి శ్వాసకోస సమస్యలు తలెత్తవచ్చు. అంతేకాదు రక్తనాళాలు సైతం గట్టిగా మారతాయి. రక్తనాళాలు గట్టిపడిన వారిలో అంగస్తంభనలు తృప్తికరంగా వుండవని వైద్యులు చెపుతారు. అందువల్ల స్మోకింగ్ ను మానేయటానికి ప్రయత్నించటం అన్ని విధాలా ఉత్తమం.
మరిన్ని
నలభై దాటితే శృంగ భంగం
రావాలి ఆ రోజులు మళ్ళీ మళ్ళీ...
భార్యాభర్తలు ఉద్యోగస్థులైతే...
వైవాహిక జీవితం సాఫీగా సాగిపోవాలంటే...
తట్టుకోలేదు... వద్దనీ అనలేదు
స్త్రీ బాలింత దశలో సెక్స్ మంచిదేనా?