|
శృంగార జీవితంలో ఫాంటసీలు: అవసరమా... ?
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
| | మనిషి జీవితంలో శృంగారానికి ఓ విశిష్టమైన స్థానముంది. ఎందుకంటే దీనిపై ఉన్నంత ఆసక్తి, అపోహలు మరే అంశంలోనూ లేవంటే అతిశయోక్తి కాదేమో. మనిషికి గాలి, నీరు, ఆహారం ఎంత ముఖ్యమో ఓ వయసు తర్వాత శృంగార జీవితం అంతే ముఖ్యం.
మిగిలిన విషయాల్లాగా శృంగార జీవితంలో మనిషి సర్ధుబాటు ప్రదర్శించలేడు. ఎందుకంటే ఎగసిపడే వాంఛ ఈ విషయంలో మనిషిని కుదురుగా ఉండనీయదు. కాబట్టే శృంగారానికి సంబంధించిన విషయాల్లోనే మనిషి కొన్నిసార్లు విచక్షణ తప్పి ప్రవర్తిస్తుంటాడు.
ఇలాంటి సందర్భాల్లో మనిషి అదుపు తప్పకుండా ఉండడానికి ఫాంటసీలు ఓ వరంలా ఉపయోగపడుతాయి. ఫాంటసీలు అంటే ఊహలని చెప్పవచ్చు. నిజజీవితంలో చేయలేని, వీలుకాని కొన్ని విషయాలకు అందమైన దృశ్యరూపమే ఈ ఫాంటసీలు.
చాలా విషయాల్లో మనిషికి ఫాంటసీలు వచ్చే అవకాశమున్నా తమ శృంగార జీవితానికి సంబంధించి మనిషి ఎక్కువగా ఈ ఫాంటసీల్లో విహరిస్తుంటాడు.
నాజూకైన నడుము, కసెక్కించే చూపులు, రెచ్చగొట్టే పరువాలు ఇలా మగాడిలో శృంగార భావాన్ని తారాస్థాయికి తీసుకెళ్లే లక్షణాలున్న స్త్రీని వద్దనే పురుషుడుంటాడా. కానీ అందరి నిజ జీవితంలో సరిగ్గా ఇలాంటి భాగస్వామే దొరకడం బహు అరుదు. అలాంటప్పుడు నిజంగా దొరకని ఈ లక్షణాలని ఫాంటసీ లోకంలో చూసి తరించడం చాలా మందికి అనుభవమే.
|