ప్రధాన పేజి > ఇతరాలు > ఆరోగ్యం > దాంపత్యం
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
దంపతుల నిత్య జీవనంలో శృంగారం ఓ భాగం  Search similar articles
దంపతుల రోజువారీ జీవనంలో శృంగారం సైతం ఓ భాగమని గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే చాలామంది దంపతుల విషయంలో శృంగారం అంటే అది కేవలం పడకగదిలో రెండు శరీరాల కలయికగా మాత్రమే భావిస్తుంటారు. అలాగే మరికొందరు శృంగారం అంటే సెక్స్ మాత్రమే అని భావనలోనూ ఉంటారు.

కానీ తరచి చూచినపుడు శృంగారానికి, సెక్స్‌కు మధ్య చాలా తేడా ఉంది. శృంగార జీవితంలో సెక్స్ ఓ భాగమే తప్ప సెక్స్ మాత్రమే శృంగారం కాదు. ఎందుకంటే దంపతుల మధ్య చిరు స్పర్శ నుంచి, ఓ బిగి కౌగిలి దాకా ఏదైనా సరే శృంగారం కావచ్చు. అలా దంపతుల మధ్య ఏర్పడిన శృంగార కాంక్ష సెక్స్‌కు దారి తీస్తుంది. అందుకే శృంగారంలో చివరి అంకంగా సెక్స్‌ను పేర్కొనవచ్చు.

అయితే శృంగార చేష్టలు ఉంటే తప్ప సెక్స్ ఉండదా అనుకునే వాళ్లూ లేకపోలేదు. దంపతుల మధ్య శృంగారపరమైన అంశాలు లేకుండానే సెక్స్ జీవితం కొనసాగవచ్చు. కానీ ఆ జీవితం కొంతకాలానికి నిస్తేజంగా మారుతుంది. అందుకే శృంగారం విషయంలో స్వేచ్ఛను, భావ ప్రకటనను కోల్పోయినవారు శృంగారానుభూతుల్ని అందుకునే ప్రయత్నంలోనూ విఫలమవుతారు.

అలాంటివారు చివరకు ఏ అనుభూతీ లేక శృంగారం పట్ల అనాశక్తిని పెంచుకుని జీవితంలో శృంగారమంటే ఏ ప్రాముఖ్యంలేని అంశంగా భావించే దశకు చేరుకుంటారు. అందుకే మనస్తత్వశాస్త్రవేత్తలు, ప్రముఖ సెక్సాలజిస్టులు చెబుతున్నదేంటంటే మానవ శరీరంలో కలిగే భౌతిక, రసాయనిక మార్పులు ఫలితంగా కలిగే జీవరసాయన చర్యల ఫలితమైన దాహం, ఆకలి లాంటిదే శృంగారం కూడా.

అయితే శృంగారం అన్నది కేవలం శరీరానికి సంబంధించింది మాత్రమే కాదు మానసికమైంది కూడా. అందుకే శృంగారాన్ని కేవలం దేహానికి సంబంధించిన ఓ చర్యగా మాత్రమే చూడడం ప్రారంభిస్తే అది భౌతిక అవసరంగానే మిగిలిపోతుంది. అందుకే దంపతుల మధ్య పరస్పర అన్యోన్యతకు కారకంగా గుర్తించగలిగితే అట్టి సహచరుల జీవితం మధురానుభూతులతో కొనసాగగల్గుతుంది.

1 | 2  >>  
మరిన్ని
భార్యాభర్తలు బిజీబిజీ: అటకెక్కుతున్న శృంగారం
అంగస్థంభన సమస్య: ఔషధాల విషయంలో జాగ్రత్త
వ్యాధుల్లోను తోడు నిలిచే దాంపత్య బంధం
మధ్యవయసులో శృంగారం: కొత్త జీవితానికి పునాది
యుక్త వయసులో ఆ పని తప్పుకాదు: ఆరోగ్యకరమే... !
శృంగార జీవితంలో ఫాంటసీలు: అవసరమా... ?