ప్రధాన పేజి > ఇతరాలు > ఆరోగ్యం > దాంపత్యం
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
దంపతులు ఏకమైతేనే శృంగారంలో ఆనందం  Search similar articles
WD PhotoWD
శృంగారమన్నది దంపతులిద్దరికీ సంబంధించినది. శృంగారం విషయంలో దంపతులిరువురు ఎలాంటి అరమరికలు లేకుండా ప్రవర్తించగల్గినపుడే వారు ఆనందపు అంచుల్ని చవిచూడగల్గుతారు. అలాకాక భాగస్వామి ఆనందం గురించి పట్టించుకోకుండా కేవలం తమ ఆనందం గురించి మాత్రమే ఆలోచిస్తే ఇక వారి శృంగార జీవితం కష్టాలమయమైనట్టే.

ఎందుకంటే చాలామంది భార్యలు చేసే ఫిర్యాదు ఎంటో తెలుసా తన భర్త తన ఆనందంతో సంబంధం లేకుండా సెక్స్‌లో పాల్గొంటాడని, కేవలం అతని ఆనందం మాత్రమే చూచుకుంటాడని. తన భర్త ఎలాంటి రొమాన్స్ లేకుండానే నేరుగా సెక్స్‌కు ఉపక్రమిస్తాడని, సెక్సు పరంగా తన ఆనందం గురించి ఎంతమాత్రం ఆలోచించడని కొందరు భార్యలు తరచూ చెబుతుంటారు.

భర్తలు ఇలా ప్రవర్తించడం వల్ల వారి భార్యలకు కొంతకాలానికి సెక్స్ అంటేనే విరక్తి కల్గుతుంది. దానితో ఛీ ఎందుకు ఈ సెక్స్ జీవితం అనే స్థాయికి వారు చేరుకుంటారు. ఇలా జరిగితే వారి దాంపత్య జీవితం ఇక సాఫీగా సాగే ఛాన్సే ఉండదు. అందుకే దంపతులిద్దరూ సెక్స్ జీవితంలో తృప్తిని చవుచూడాలంటే ఏం చేయాలన్న విషయాన్ని సెక్సాలజిస్టులు ఈ విధంగా చెబుతున్నారు.

సెక్స్ విషయంలో మూడు దశలుంటాయి. ఫోర్‌ప్లే, ప్లే, ఆప్టర్‌ప్లే అనేవే ఆ మూడు దశలు. ఈ మూడు దశలను గురించి తెలుసుకుని ప్రవర్తించగల్గినపుడే దంపతుల శృంగారజీవితం ఆనందమయం అవుతుంది. మొదటిదశ అయిన ఫోర్‌ప్లేలో చక్కగా కబుర్లు చెప్పుకోవడం, ఆప్యాయంగాను, శృంగారపరంగాను దగ్గరకావడం, శృంగారం కోసం ఒకరినొకరు ప్రేరేపించుకోవడం చేయాలి.

ఇందుకోసం రొమాంటిక్ విషయాల గురించి మాట్లాడుకోవడం, కౌగిలించుకోవడం లాంటివి చేయాలి. ఇలా చేయడం వల్ల రెండవదశ అయిన ప్లేలో అంటే సెక్స్‌లో దంపతులిద్దరు మంచి ఊపుతో పాల్గొంటారు. ప్లే ముగియగానే పురుషుడు అలాగే పక్కకి తిరిగి పడుకోకుండా ఆప్టర్‌ప్లేకు ఉపక్రమించాలి.

ఇందుకోసం స్త్రీని మరింత దగ్గరగా పొదవి పట్టుకోవడం, కౌగలించుకుని పడుకోవడం చేయాలి. ఎందుకంటే స్త్రీలు ప్లే కన్నా ఫోర్‌ప్లే, ఆప్టర్‌ప్లేకే ఎక్కువగా ఇష్టపడుతారు. ఈ రెండింటిని సమర్థంగా అందించగలిగితే స్త్రీలు సెక్స్ విషయంలో ఎక్కువ ఆనందాన్ని పొందగల్గుతారు. దీనివల్ల పురుషునికి సైతం ఎక్కువ ఆనందం లభిస్తుంది.

ఎలాగంటే ఒకసారి సెక్స్‌లో ఆనందాన్ని అనుభవించిన స్త్రీ మరోమారు సెక్స్‌లో పాల్గొనప్పుడు ఉత్సాహంగా పాల్గొంటుంది. అలాగే పురుషునికి తనవంతు సాయాన్ని అందించడం ద్వారా అతను ఎక్కువ ఆనందాన్ని పొందడానికి సాయపడుతుంది. అందుకే శృంగార జీవితంలో కేవలం సెక్స్‌కు మాత్రమే ప్రాముఖ్యం ఇవ్వకుండా రొమాన్స్‌కు సైతం ప్రాముఖ్యం ఇచ్చినపుడే దంపతులు ఎక్కువ ఆనందాన్ని పొందగలరు.
మరిన్ని
విహాహేతర సంబంధాలతో దాంపత్య బంధం విచ్ఛిన్నం
దంపతుల నిత్య జీవనంలో శృంగారం ఓ భాగం
భార్యాభర్తలు బిజీబిజీ: అటకెక్కుతున్న శృంగారం
అంగస్థంభన సమస్య: ఔషధాల విషయంలో జాగ్రత్త
వ్యాధుల్లోను తోడు నిలిచే దాంపత్య బంధం
మధ్యవయసులో శృంగారం: కొత్త జీవితానికి పునాది