ఈ వినడానికి చాలా ఇబ్బందిగా ఉంది కదూ... నిజమే.... కాని గర్భం ధరించిన వారిలో ఎన్నెన్నో అనుమానాలు ఉంటాయి. సంసార(లైంగిక) జీవనానికి దూరంగా ఉండాలా? లేదా? భార్యా భర్త కలిస్తే ఏమవుతుంది? పుట్టబోయే బిడ్డకేమైనా ప్రమాదమా? గర్భణీగా ఉన్న మహిళకే ప్రమాదమా? ఇలాంటి ప్రశ్నలు వారిని వేధిస్తుంటాయి. కొందరైతే ఆందోళన చెందుతుంటారు.
కొత్త పెళ్ళయ్యి, తొలిసారి గర్భం ధరించిన యువతులైతే మరీ ఎక్కువగా ఒత్తిడికి గురవుతుంటారు. తెలియని వయస్సు, భర్త కోరికను కాదనలేరు. అవునంటే ఏమవుతుందో తెలియదు. మగవారికి కూడా దీనిపై అంతగా అవగాహన ఉండదు. మరి ఇలాంటప్పుడు ఏమి చేయాలి. మీ సందేహాలను తీర్చడానికి ఈ చిన్న ప్రయత్నం.
ఆరోగ్య సమస్యలు ఉన్న గర్భీణీ స్త్రీలు సంసార జీవనంలో పాల్గొనకపోవడం మంచిది. తొమ్మిది నెలలపాటు భర్తకు దూరంగా ఉండడం చాలా ఉత్తమం. అయితే ఈ విషయంలో భార్యాభర్తల మధ్య అవగాహన ఉండాలి. ఆరోగ్యవంతమైన గర్భణీలు కూడా ఈ విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి.
గర్భం ధరించిన మొదటి మూడు నెలలు, చివరి రెండు నెలలు సంసార జీవనానికి దూరంగా ఉండాలి. మొదటి మూడు నెలలు భార్యాభర్త కలిస్తే అబార్షన్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టీ సంసార జీవించడం ఉత్తమం.
అలాగే చివరి రెండు నెలలు కలవడం వలన రక్త స్రావం జరిగే అవకాశం ఉంటుంది. ఇటువంటి పరిస్థితులలో కాన్పుకావడం కష్టంకావచ్చు. అలాగే ముందుగా ప్రసవం జరిగే అవకాశం ఉంటుంది. ఇది తల్లీబిడ్డకు క్షేమం కాదు. అందుకే సంసార జీవనం విషయంలో నిబంధన ప్రకారం ఉండడం శ్రేయష్కరం. |