సెక్స్ సుఖాన్ని పూర్తి స్థాయిలో అనుభవించేందుకు కొందరు వయగ్రాను ఆశ్రయిస్తుంటారు. అయితే అది పనిచేయడానికి సమయం కాస్త ఎక్కువ తీసుకుంటుంది. ఈ నేపధ్యంలో సాధారణ వయగ్రాకు మించి శక్తివంతమైన ఔషధాన్ని శాస్త్రజ్ఞులు కనుగొన్నారు. దానికి "సన్ ఆఫ్ వయగ్రా" అని నామకరణం చేశారు. శృంగార జీవితంలో సమర్థవంతంగా పాల్గొనలేని జంటలకు ఇది ఓ గుడ్ న్యూస్.సన్ ఆఫ్ వయగ్రా కేవలం 15 నిమిషాల్లోనే తన శక్తిని చూపిస్తుందంటున్నారు శాస్త్రజ్ఞులు. అదేవిధంగా సాధారణ వయగ్రా ప్రభావంనుంచి బయటపడాలంటే కనీసం 8 గంటల సమయం పడుతుంది. కానీ సన్ ఆఫ్ వయగ్రా తీసుకున్నవారు కేవలం గంటన్నర వ్యవధిలో దాని ప్రభావం నుంచి బయటపడవచ్చు. అంతేకాదు మామూలు వయగ్రా వల్ల తలనొప్పి ఇతర సమస్యలు తలెత్తుతుంటాయి. అయితే సన్ ఆఫ్ వయగ్రా వల్ల ఇటువంటి సమస్యలు దరిచేరవు అంటున్నారు ప్రొఫెసర్ ఫ్రాన్సిస్కో.హృద్రోగ సమస్యలున్నవారు సైతం సన్ ఆఫ్ వయగ్రాను నిరభ్యంతరంగా వాడవచ్చంటున్నారు. ఈ మాత్రలు ప్రస్తుతం రోమ్ హార్ట్ యూనివర్శిటి పరిశీలనలో ఉన్నాయి. |
సంబంధిత సమాచారం కోసం శోధించండి. |