బరువు బాధ్యతలన్నీ తీరిపోయి, ప్రశాంతంగా జీవితం గడుపుతున్న దంపతులు ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకుని, నిండైన జీవితాన్ని ఆస్వాదించే పండంటి వయసు అనటంలో ఏమాత్రం సందేహంలేదు. అయితే ఈ వయసులో కూడా వారిలో శృంగార వాంఛలు ఏ మాత్రం తగ్గవు కానీ, శరీరం అందుకు సహకరించదు, ఈ విషయంలో పురుషులకంటే స్త్రీల పరిస్థితే ఘోరంగా ఉంటుంది.లేటు వయసు శృంగారం మదిలో మధురానుభూతులను మిగల్చడం సరికదా... మెనోపాజ్ దశ దాటిన మహిళలకు నరకప్రాయం అవుతుంది. అయితే... ఇందుకు మోనాష్ యూనివర్శిటీ పరిశోధకులు ఓ చక్కటి పరిష్కారాన్ని సూచిస్తున్నారు. అదేంటంటే... ఇప్పటిదాకా పురుషులు మాత్రమే వాడుతున్న సెక్స్ హార్మోన్ ప్యాచ్‌లు మహిళల్లోనూ పనిచేస్తాయి కాబట్టి వాడవచ్చని చెబుతున్నారు.పై పరిశోధనలకు నేతృత్వం వహించిన డాక్టర్ సుసాన్ ఆర్ డేవిస్ మాట్లాడుతూ... టెస్టోస్టిరాన్ హార్మోన్ ప్యాచ్‌ల వల్ల కొన్ని దుష్ప్రభావాలు ఉన్నప్పటికీ... మెనోపాజ్ దాటిన మహిళలకు చక్కటి ఫలితాలనిస్తాయని పేర్కొన్నారు. తమ పరిశోధనల్లో భాగంగా 800 మంది మహిళలపై ఈ ప్యాచ్‌ల పనితీరును పరిశీలించినట్లు ఆయన తెలిపారు.ముందుగా తమ పరిశోధకులు మెనోపాజ్ దాటిన మహిళలను ఎంపిక చేసి, వారి ఆరోగ్య పరిస్థితుల ఆధారంగా రెండు గ్రూపులుగా విభజించారని, వారిలో ఒక గ్రూపు మహిళలకు ఎక్కువ మోతాదుగ 300ఎంజీ టెస్టోస్టిరాన్ ప్యాచ్‌లు, మరో గ్రూపు వారికి ఉత్తుత్తి మాత్రలను ఇచ్చినట్లు డేవిస్ వివరించారు.ఇరవై నాలుగు వారాల పరిశీలన తరువాత ఎక్కువ మోతాదులో హార్మోన్ ప్యాచ్‌లు ఇచ్చిన గ్రూపులో 2.1 శాతం మహిళలు తమ శృంగార జీవితంపై పూర్తి సంతృప్తి వ్యక్తం చేసినట్లు డేవిస్ పేర్కొన్నారు. మరో గ్రూపు మహిళల్లో 1.2 శాతం మహిళలు మాత్రమే పూర్తిగా సంతృప్తి చెందినట్లు చెప్పారన్నారు.అయితే ఈ హార్మోన్ వాడకం వల్ల దుష్పభావాలు కూడా ఉన్నాయని చెప్పిన డేవిస్... అతికొద్ది మంది మహిళల్లో అవాంఛిత రోమాలు పెరగడం లాంటివి జరిగాయని చెప్పారు. తమ ఈ అధ్యయనంలో పాల్గొన్న నలుగురు మహిళలు కూడా రొమ్ము క్యాన్సర్ బారిన పడ్డారని... అయితే ఇలాంటి సంఘటనలు బహు అరుదుగా జరుగుతుంటాయి కాబట్టి, టెస్టోస్టిరాన్ ప్యాచ్‌లను నిరభ్యంతరంగా వాడవచ్చని డేవిస్ సూచించారు. |