మంచి ఎత్తు, మంచి రంగు, చూడ చక్కని రూపం ఉన్నవారిని చూస్తే ఎవరికైనా ఇట్టే ఆకర్షణ కల్గుతుంది. అందుకే ప్రతివారూ తాము కూడా మంచి ఎత్తు, మంచి రంగు ఉండాలని కోరుకుంటారు. అది మానవ నైజం. అయితే అందరూ ఒకే ఎత్తు, ఒకేలాంటి రంగూ ఉండడం కుదరదు. అంతమాత్రాన పొట్టిగా ఉన్నవారు రంగులేనివారు ఎందుకూ కొరగారు. వారిలో సామర్థ్యాలేమీ ఉండవు అనుకుంటే అది పూర్తిగా తప్పే.
ఎందుకంటే పొడుగ్గా, అందంగా ఉన్నవారిలానే పొట్టిగా, రంగు తక్కువగా ఉన్నవారు కూడా జీవితంలో రాణించడం అందరికీ తెలిసిందే. సరిగ్గా ఇదే ఉదాహరణను మగవారి పురుషాంగం విషయంలోనూ అన్వహించుకోవాలని సెక్స్ స్పెషలిస్టులు సూచిస్తున్నారు. తమ అంగం పరిమాణంపై అనవసరమైన అపోహలు పెంచుకుని సెక్స్ జీవితాన్ని నరకప్రాయం చేసుకోకుండా సెక్స్ జీవితాన్ని చక్కగా ఎంజాయ్ చేయడానికి ప్రయత్నించాల్సిందిగా వారు పేర్కొంటున్నారు.
తమకు యుక్తవయసు వచ్చినా అంగం పరిమాణం మాత్రం ఇంకా చిన్నదిగా ఉందని అందువల్ల తాము సెక్స్ జీవితానికి పనికిరానేమోననే భయం, ఆందోళన చాలామంది యువకుల్లో ఉంటోంది. సెక్స్ పరిజ్ఞానంపై, శారీరక నిర్మాణంపై సరైన అవగాహన లేకపోవడం వల్లే ఈ తరహా అనుమానాలు మదిని తొలిచేస్తాయన్నది సెక్సాలజిస్టుల వివరణ.
అందుకే సెక్స్ విజ్ఞానం గురించి సరైన రీతిలో తెల్సుకుంటే ఈ తరహా అనుమానాలు తొలగిపోతాయని వారు చెబుతున్నారు. ఇంతకీ మగవారి అంగ పరిమాణంపై సెక్స్ స్పెషలిస్టులు ఏం చెబుతున్నారంటే... మనసులో సెక్స్ కోరికలు కలగడం, ఆ సమయంలో అంగం స్తంభించగల్గడం, అలా స్తంభించినపుడు అంగం పరిమాణం కనీసం మూడున్నర అంగుళాలు ఉండడం... ఇలాకానీ ఉంటే సదరు వ్యక్తి తన అంగ పరిమాణంపై, దాని సమర్థతపై ఇక ఏమాత్రం దిగులు పడాల్సిన అవసరం లేదు.
|