ప్రధాన పేజి > ఇతరాలు > ఆరోగ్యం > దాంపత్యం > కోరికలను పెంచే ఎలక్ట్రానిక్ "సెక్స్ చిప్"
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
కోరికలను పెంచే ఎలక్ట్రానిక్ "సెక్స్ చిప్"
FILE
శృంగారంలో పాల్గొన్నా, భోజనం చేసినా ఎలాంటి అనుభూతి కలగని జబ్బుతో బాధపడుతున్న వారికోసం తాజాగా... కోరికలను పెంచే ఎలక్ట్రానిక్ "సెక్స్ చిప్"‌ను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేస్తున్నారు. ఇది మెదడులోని అంతర్గత భాగాలకు స్వల్ప విద్యుద్ఘాతాన్ని ఇవ్వడం ద్వారా, ఒంట్లో సెక్స్ కోరికలను ఉత్తేజపరుస్తుందని వారు చెబుతున్నారు.

పార్కిన్సన్ వ్యాధికి చికిత్సలో భాగంగా.. అమెరికాలో ఇప్పటికే ఈ విధానాన్ని అనుసరిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా... సెక్స్ చిప్‌ను రూపొందించే పరిశోధనల్లో భాగంగా మెదడులోని "ఆర్బిటో ఫ్రంటల్ కార్టెక్స్"పై శాస్త్రవేత్తలు తమ దృష్టిని కేంద్రీకరించారు.

సెక్స్ చిప్ గురించి వాషింగ్టన్‌లోని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ మొర్టెన్ క్రింగెల్‌బాచ్ మాట్లాడుతూ... శృంగార అభిరుచులకు చెందిన భావోద్వేగాలు, అనుభూతులు, ఆహారపు రుచులకు మెదడులోని పై ప్రాంతం కేంద్రంగా ఉంటుందన్నారు. తాము రూపొందించబోయే సెక్స్ చిప్ ఆ ప్రాంతాన్ని ఉత్తేజపరుస్తుందని చెప్పారు. తద్వారా కోరికలు పెరిగి, అనుభూతులతో కూడిన శృంగార జీవితాన్ని పొందవచ్చని ఆయన పేర్కొన్నారు.

ఇంకేముంది... శృంగార జీవితం చప్పగా, ఎలాంటి అనుభూతి లేని విధంగా తయారైందని బాధపడుతున్న శృంగార ప్రేమికులకు సెక్స్ చిప్ తయారీ కాస్తంత ఊరటే అని చెప్పవచ్చు. సో... కోరికలను పెంచే ఈ సెక్స్ చిప్ త్వరలోనే మార్కెట్లోకి వచ్చేయాలని కోరుకుందామా..?!
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
నలభైలలోనూ చక్కని సెక్స్ జీవితం కోసం... ?
ఆ పరిమాణంపై అపోహలు... అశాంతికి మూలం
సెక్స్... ఒక మంచి ఔషధం
"వృద్ధాప్యం" సెక్స్‌కు శాపం కాబోదు...!
సమర్థవంతమైన సెక్స్‌కి "సన్ ఆఫ్ వయగ్రా"
శృంగారం గురించి మాట్లాడటమే తప్పయిన చోట...