ప్రధాన పేజి > ఇతరాలు > ఆరోగ్యం > దాంపత్యం > అంగ స్తంభనకు ప్రధాన లోపం అపోహ!
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
అంగ స్తంభనకు ప్రధాన లోపం అపోహ!
FileFILE
చాలామంది పురుషుల్లో అంగ స్తంభన ఒక సమస్యగా ఉంటుంది. దీన్ని ఒక వ్యాధిగా భావించే పలువురు తీవ్ర ఆందోళనకు గురవుతారు. దీని గురించే నిరంతరం ఆలోచిస్తూ.. తమలో తాము మధన పడుతుంటారు. ఇలాంటి అపోహలు యువకుల్లో ఎక్కువగా ఉంటాయి. అయితే దీనిపై కొందరు పురుషులు అతిగా స్పందించి దాని గురించే ఆలోచిస్తూ.. సమస్యను మరింత పెద్దదిగా చేసుకుంటారు.

ముఖ్యంగా పురుషాంగం పరిమాణం ప్రతి వ్యక్తిలోనూ ఒకేలా ఉండదు. పెద్ద సైజులో ఉన్నంత మాత్రాన అందులో ప్రత్యేకించి విషయమేమీ ఉండదు. అలాగే చిన్న సైజు వల్ల సెక్స్‌కు పనికి రాకుండా పోయేదేమి లేదు. అయితే ఇలాంటి వారు తమ అంగ పరిమాణాన్ని చూసుకుని కొందరు జీవితంలో ఇక తాము రతి క్రీడకు పనికిరామనే నిర్థారణకు వచ్చేస్తుంటారు. ఇలాంటి భావనకు లోనుకావడమే పెద్ద తప్పు.

మరికొందరు ఆత్మన్యూన్యతను తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడిన సంఘటనలు ఉన్నాయి. ఇంకొందరు విచిత్రంగా తమ బాధలు చెప్పుకోలేక నకిలీ వైద్యులను సంప్రదించి మోసపోతుంటారు. తమ అంగం నిలకడగా ఉండదని... కుడిపక్కకో... ఎడమ వైపుకో ఒరిగిపోతుందని బాధపడుతుంటారు. స్పందన లేనప్పుడు అంగ పరిమాణం చాలా తక్కువ పరిమాణంలో ఉండటం సహజం.

అసలు ఇవన్నీ పక్కనపెడితే... శృంగార జీవితానికి కావలసింది పొట్టా... పొడుగా... వంకరా... చిన్నదా అనే అంశం ఇక్కడ ముఖ్యం కాదు. మనుషుల సైజులలోనే ఎన్నో తేడాలు ఉంటాయి. రంగుల్లో, రూపురేఖల్లో కూడా ఇవి స్పష్టంగా తెలుస్తున్నాయి. పురుషుల అంగ పరిమాణంలోనూ తేడాలు కనిపిస్తాయి. స్త్రీల విషయంలోనూ అంతే... అయితే పురుషులు స్పందించినట్లుగా వాళ్లలో అటువంటి పరిస్థితి ఉండదు.

ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే శృంగారానుభూతి మాత్రమే. స్పందనలు ఉన్నాయా లేవా అన్నదే ప్రధానాంశం. తృప్తిచెందడం అనేది మానసిక భావన. మనసు ఉల్లాసంగా ఉంటే అదే లక్షకోట్ల ఆనందం ఇస్తుంది. అదే మానసిక స్థితి బాగోలేనప్పుడు ఎంతగా స్పందించినా సంతృప్తి అనేది లభించదు.

అందుకే ఆలుమగలు ఇద్దరిలోనూ ముందు ఒకరినొకరు ఇష్టం కలిగించుకునేలా నడుచుకోవాలి. ఒకరులేనిదే మరొకరు లేరనే భావన ఇద్దరిలో కలిగినప్పుడే వాళ్లు చేసే ప్రతి పనిలోనూ నూటికి నూరు శాతం తృప్తి పొందుతారు.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
నపుంశకత్వ భయమా.....
కోరికలను పెంచే ఎలక్ట్రానిక్ "సెక్స్ చిప్"
నలభైలలోనూ చక్కని సెక్స్ జీవితం కోసం... ?
ఆ పరిమాణంపై అపోహలు... అశాంతికి మూలం
సెక్స్... ఒక మంచి ఔషధం
"వృద్ధాప్యం" సెక్స్‌కు శాపం కాబోదు...!