ప్రధాన పేజి > ఇతరాలు > ఆరోగ్యం > దాంపత్యం > శృంగారానికి దూరం చేసే "ఊబకాయం"
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
శృంగారానికి దూరం చేసే "ఊబకాయం"
FILE
ఇప్పటిదాకా ఊబకాయం సమస్యవల్ల గుండెజబ్బులు, రక్తపోటు, మధుమేహం లాంటి వ్యాధులకు కారణమవుతుందన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ సమస్య సంసార సుఖానికి కూడా దూరం చేస్తుందని తాజా పరిశోధనలు వెల్లడిస్తున్నాయి.

లావుగా ఉన్నవారికి శృంగారం కాస్తంత ఇబ్బందికరమే. ఇందుకు వారి శరీరం పూర్తిగా సహకరించక పోవడం ఒక కారణమైతే... స్ఖలన సమస్య రెండో కారణంగా చెప్పుకోవచ్చు. గత పాతికేళ్ల కాలంలో ఊబకాయుల సంఖ్య పెరిగినట్లుగానే... స్ఖలన సమస్యలతో బాధపడేవారి సంఖ్య కూడా రోజు రోజుకూ పెరిగిపోతోంది.

ఇక పరిశోధనా వివరాల్లోకి వస్తే.. వాషింగ్టన్‌లోని అల్వరాడో ఆసుపత్రి పరిశోధకులు ఊబకాయానికీ, స్ఖలన సమస్యలకు ఏమైనా లింకు ఉందా... అన్న కోణంలో పరిశోధనలు జరిపారు. వీరి పరిశోధనల్లో 2,435 మంది ఊబకాయుల శృంగార జీవితాన్ని ఆరు సంవత్సరాల పాటు పరిశీలించిన అనంతరం... ఊబకాయం వల్ల స్ఖలన సమస్యలు కూడా పెరిగిపోతున్నట్లు గుర్తించారు.

ఈ విషయమై సెక్సువల్ హెల్త్ విభాగాధిపతి ఇర్విన్ గోల్డ్ స్టీన్ మాట్లాడుతూ.. 2001వ సంవత్సరం నుండి 2007దాకా జరిగిన పై అధ్యయనంలో పొట్ట భాగంలో అధికంగా చేరుకునే కొవ్వు, పురుషుల్లో లైంగిక హార్మోన్ ఉత్పత్తిని తగ్గించి వేస్తుందని, తద్వారా స్ఖలన సమస్యలకు గురవుతున్నట్లు తాము గుర్తించామని చెప్పారు. ఎంతగా కొవ్వు పేరుకుపోవడం ఎక్కువైతే, హార్మోన్ల విడుదల అంతగా తగ్గిపోతున్నట్లు పరిశోధకులు గమనించారని ఆయన తెలిపారు.

నిజానికి... స్ఖలన సమస్యలకు మానసిక ఆందోళన, భయం, లైంగిక ఉద్రేకం లాంటి మానసిక సమస్యలు కూడా కారణాలన్న సంగతి తెలిసిందే. అయితే స్ఖలన సమస్యలకు ఊబకాయంతో ప్రత్యక్ష సంబంధం ఉన్నట్లుగా తమ పరిశోధనలో తేలిందని ఇర్విన్ పేర్కొన్నారు. కాబట్టి, అధిక బరువు బారినపడ్డవారు... స్ఖలన సమస్యలతో బాధపడుతున్నట్లయితే, వెంటనే లావు తగ్గే ప్రయత్నాలను చేయడం మంచిది. లేకపోతే మీ శృంగార జీవితానికి ఎడబాటు కలిగే ప్రమాదం పొంచి ఉన్నట్లే..!
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
ఈ సమస్యలను ఎలా పరిష్కరించాలి?
అంగ స్తంభనకు ప్రధాన లోపం అపోహ!
నపుంశకత్వ భయమా.....
కోరికలను పెంచే ఎలక్ట్రానిక్ "సెక్స్ చిప్"
నలభైలలోనూ చక్కని సెక్స్ జీవితం కోసం... ?
ఆ పరిమాణంపై అపోహలు... అశాంతికి మూలం