మానవ సమాజంలో స్త్రీ పురుషుల కలయిక ప్రకృతి సహజం. శృంగారం (సెక్స్) అనే పదమే ఒక రకమైన ఉద్విగ్నతకు లోను చేస్తుంది. తనకు నచ్చిన మగాడితో సరససల్లాపాలు సాగించేందుకు వెనుకంజ వేస్తారు. కనీసం.. మనస్సు విప్పి మాట్లాడేందుకు సైతం స్త్రీ పురుషులు బిడియ పడతారు. దీనికంతటికీ కారణంగా సెక్స్ గురించి ఓపెన్‌గా మాట్లాడ కూడదనే భావన ప్రతి ఒక్కరిలో దృఢంగా నాటుకుని ఉండటమే ఇందుకు కారణం.
అందుకే.. ఏ పని అయితే చేయకూడదో.. మాట్లాడకూడదంటారో.. దానిపైనే ఎక్కువ మనస్సు లగ్నం చేస్తారు. ఇదీ మానవ నైజం. సాధారణంగా నిషేధిత సమాచారంపై ఆసక్తి ఎక్కువ చూపిస్తారు. అందుకే మనిషి జీవన చక్రంలో సెక్స్ ప్రస్తావనే ఎక్కువగా వస్తుంది. సెక్స్ పట్ల ఉన్న బిడియం, భయాందోళలను అధిగమించిన వారే.. శృంగార జీవితంలో ఉచ్ఛ సౌఖ్యాన్నే కాదు. మనస్సుకు మించిన ఆనందాన్ని.. సంతృప్తిని పొందుతారు.
ఇలాంటి సుఖం పూర్తి స్థాయిలో పొందాలంటే.. ఒకరినొకరు ఇష్టపడి స్త్రీపురుషులు తొలుత చేయాల్సింది.. మనస్సు విప్పి శృంగారంపై మాట్లాడుకోవాలి. అలాగే.. సెక్స్‌లో పాల్గొన్న పురుషుడు.. తన పని పూర్తయ్యాక పక్కకు తిరిగి పడుకుంటే.. దాన్ని శృంగారమనరు. తన కామవాంఛ తీర్చుకున్న తర్వాత.. స్త్రీని నిర్లక్ష్యం చేసినట్టుగా పేర్కొంటారు.
అందుకే.. రతి క్రీడ పూర్తయ్యాక కూడా.. స్త్రీపురుషులిద్దరు తమ చిలిపి చేష్టలతో తనివితీరా ఆనందం పొందాలని శృంగార నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అలాగే.. తనతో శారీరక సంబంధం జరిపే పురుషుడుని కూడా స్త్రీ తనకు తోచిన రీతిరో ఉత్తేజ పరచాలి. అపుడే పురషుడు మరింత రెచ్చిపోయి.. శృంగారంలో పాల్గొంటాడు. దీనివల్ల రతిక్రీడలో పాల్గొన్న స్త్రీపురుషులిద్దరు స్వర్గసుఖాలను అనుభవిస్తారు. |