ఊబకాయం పురుషుల్లో అంగస్తంభనపై పలు అపోహలు ఉంటాయి. ఇలాంటి వారు తమ సమస్యపై అతిగా స్పందిస్తూ లోలోపల మధనపడుతూ ఉంటారు. ముఖ్యంగా ఊబకాయం పురుషుల్లో అంగ పరిమాణం తక్కువగా ఉంటుందని వైద్యులు చెపుతున్నారు. అలాగే.. పురుషులందరిలో అంగ పరిమాణం ఒకే రకంగా ఉండదని, వివిధ సైజుల్లో ఉంటుందని వారంటున్నారు.
అంగ పరిమాణం పెద్దదిగా ఉన్నంత మాత్రానా దానివల్ల వనగూరే ప్రయోజనం ప్రత్యేకించి ఏమీ లేదట. అంతమాత్రానా చిన్న సైజును చూసుకుని కొందరు దిగాలు పడాల్సిన అవసరం అంతకంటే లేదు. ప్రధానంగా ఊబకాయం పురుషుల్లో అంగం సైజు... పొట్టా... పొడుగా... వంకరా... చిన్నదా అన్నది ఇక్కడ ప్రధానాంశం కాదు.
ఇలాంటి వారిలో శృంగారంపై స్పందించే మనస్సు ఉందా లేదా అన్నదే ఇక్కడ కీలకాశం. ఊబకాయం పురుషుల్లో సెక్స్ పట్ల విపరీతమైన కోరికలు ఉన్నట్టయితే.. వారికి ఇదే పెద్ద సమస్య కాబోదని వైద్య నిపుణులు అంటున్నారు.
అందువల్ల ఇలాంటి పురుషులు తమ ఊబకాయంపై దిగులు చెందడం మాని తమ ప్రియసఖితో ఏవిధంగా సెక్స్ అనుభవాలను పంచుకోవాలనే అంశంపైనే దృష్టి సారించాలని వైద్యులు సలహా ఇస్తున్నారు. |