ప్రధాన పేజి > ఇతరాలు > ఆరోగ్యం > దాంపత్యం > నీటి కాలుష్యంతో లైంగిక సామర్థ్యం ప్రశ్నార్థకం
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
నీటి కాలుష్యంతో లైంగిక సామర్థ్యం ప్రశ్నార్థకం
FILE
నీటి కాలుష్యం వల్ల పురుషుల లైంగిక సామర్థ్యం ప్రశ్నార్థకంగా మారుతుందని తాజా పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. నీటి కాలుష్యానికీ, మగతనానికీ సంబంధం ఏంటని ఆలోచిస్తున్నారా..? నీటి కాలుష్యానికి కారణమైన కొన్ని రసాయనాలు పురుషుల్లో లైంగిక హార్మోన్లను నిర్వీర్యం చేస్తున్నాయని పరిశోధకులు తేల్చి చెబుతున్నారు.

వివరాల్లోకి వస్తే... లండన్‌లోని బ్రూనెల్ యూనివర్సిటీ పరిశోధకులు నీటి కాలుష్యానికి కారణమైన రసాయనాలు, మానవులపై వాటి ప్రభావం అన్న విషయంపై, మూడు సంవత్సరాలకు పైబడి అధ్యయనం జరిపారు. పరిశ్రమల నుంచి వెలువడే వ్యర్థ రసాయనాలు నేరుగా జల వనరుల్లోకి ప్రవేశిస్తున్నాయి. ఈ రసాయనాలు ఒక్క మానవులనే కాకుండా, వన్యప్రాణులు, పక్షులు, మరీ ముఖ్యంగా మగవారి సంతాన సాఫల్యతపై తీవ్ర దుష్ప్రభావం చూపుతున్నట్లు వీరు కనుగొన్నారు.

పై పరిశోధనలకు నేతృత్వం వహించిన సుసాన్ జాబ్లింగ్ మాట్లాడుతూ... ఇటీవలి కాలంలో పురుషుల్లో సంతాన సాఫల్య సమస్యలు పెరగడానికి ఇతరత్రా కారణాలతో పాటు, నీటి కాలుష్యమూ ప్రధాన కారణంగా ఉంటోందని అన్నారు. నీటిలో కలసిపోయిన వ్యర్థ రసాయనాలు పురుషుల్లో టెస్టిక్యులర్ డిస్‌జెనిసిస్ అనే సమస్యకు కారణాలవుతున్నాయని వివరించారు. ఇప్పటివరూ ఈ దిశగా జరిగిన అధ్యయనాలన్నీ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని సుసాన్ తెలిపారు.

ఇదిలా ఉంటే... ఎలాంటి వ్యర్థ వనరుల నుంచి ఈ రసాయనాలు విడుదలవుతున్నాయన్న విషయంపై ప్రస్తుతం పరిశోధకులు దృష్టి సారించారు. అలాగే.. మానవులు, జంతుజాలం సంతానోత్పత్తిపై నీటి కాలుష్యం ఎలాంటి ప్రభావం చూపుతుంతో మరింత క్షుణ్ణంగా తెలుసుకునేందుకు ఈ అధ్యయనాన్ని కొనసాగిస్తున్నారు.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
ఊబకాయం పురుషుల్లో అంగ స్తంభనపై అపోహా!
సైన్స్ కంటే ఆర్ట్స్ అమ్మాయిలే బెటర్!
ప్రసవ తేదీకి ముందు "సెక్స్"
"ప్రోత్సాహం" రతి క్రీడకు ప్రధాన కారకం!
శృంగారానికి దూరం చేసే "ఊబకాయం"
ఈ సమస్యలను ఎలా పరిష్కరించాలి?