ప్రధాన పేజి > ఇతరాలు > ఆరోగ్యం > దాంపత్యం > కన్నెపొరపై యువకులకు అపోహలు వద్దు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
కన్నెపొరపై యువకులకు అపోహలు వద్దు
FileFILE
సాధారణంగా యువతుల కన్యత్వానికి కన్నెపొరను ప్రమాణికంగా తీసుకోవడం నేటి యువకులకు ఒక అలవాటుగా మారింది. కన్నెపొర ఉంటేనే ఆ యువతి కన్నెత్వం కలిగిందనేందుకు చిహ్నంగా భావిస్తుంటారు. అలా లేకుంటే.. ఆ యువతి ముందుగానే సెక్స్‌లో పాల్గొన్నట్టు భావిస్తుంటారు. దీంతో పలువురు యువకులు వివాహమైన కొద్దిరోజులకే తమ పండంటి వివాహబంధాన్ని తెంచుకుంటారు.

సాధారణంగా కొంతమంది యువతుల్లో కన్నెపొర అసలు ఉండదు. మరికొందరిలో ముఖ్యంగా వ్యాయామాలు చేసే యువతుల్లో వారి వేసే ఆసనాల ఫలితంగా కన్నెపొర వారికి తెలియకుండానే చిట్ల పోవచ్చు. ఇంకొందరు స్వయంతృప్తి కోసం వేలుతో రుద్దుకున్నా అది చిరిగి పోయే ప్రమాదం ఉందని సెక్సాలజిస్టులు అంటుంటుంటారు.

అంతమాత్రాన ఒక యువతికి కన్నెత్వం లేదని భావించడం సరికాదు. ముఖ్యంగా శోభనం రాత్రి పలువురు యువతులకు కన్నెపొర చిట్లడం వల్ల రక్తస్రావమవుతుంది. మరికొందరిలో ఇలా జరగదు. వీరికి కన్నెత్వం లేదని భావించరాదు. యోనిద్వారా ఉండే కండరాలు బిగుసుగా ఉంటే... రక్తస్రావం అవుతుంది. మరికొన్ని సందర్భాల్లో రక్తం కారకపోవచ్చు.

అందుకని.. ఆ యువతికి పెళ్లికి ముందే మరొకరితో వివాహేతర సంబంధం ఉందని భావించవద్దు. మరికొందరి యువతుల్లో కన్నెపొర చిరగకుండా కూడా ఉంటుందని సెక్సాలజిస్టులు అంటున్నారు. ఈ పొర కొందరి యువతుల్లో బాగా మందగా ఉండటం లేదా.. అర్థచంద్రాకారంలో ఉండటం వల్ల సెక్స్‌లో పాల్గొన్నపుడు చిట్లిపోదనే వాదనా ఉంది.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
నీటి కాలుష్యంతో లైంగిక సామర్థ్యం ప్రశ్నార్థకం
ఊబకాయం పురుషుల్లో అంగ స్తంభనపై అపోహా!
సైన్స్ కంటే ఆర్ట్స్ అమ్మాయిలే బెటర్!
ప్రసవ తేదీకి ముందు "సెక్స్"
"ప్రోత్సాహం" రతి క్రీడకు ప్రధాన కారకం!
శృంగారానికి దూరం చేసే "ఊబకాయం"