ప్రధాన పేజి > ఇతరాలు > ఆరోగ్యం > దాంపత్యం > నేనేమో జున్నుముక్క.. నువ్వేమో ఉల్లిపాయ..!
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
నేనేమో జున్నుముక్క.. నువ్వేమో ఉల్లిపాయ..!
FILE
"ఆడవారి గాలి తగిలితే ఆ బ్రహ్మకైనా పుట్టు రిమ్మ తెగులు" అని పెద్దలు ఊరకే అనలేదు. ఆడగాలికి అంత శక్తి ఉందని వారు ఎలా కనిపెట్టారో తెలియదుగానీ... అతివల దేహ పరిమళం మగవారిని విపరీతంగా ఆకర్షిస్తుందని తాజాగా జరిపిన ఓ శాస్త్రీయ పరిశోధనల్లో వెల్లడైంది.

వివరాల్లోకి వస్తే... స్వీడన్‌కు చెందిన ఓ పరిశోధకుల బృందం ఆడ-మగలను ఆకర్షించే పలు విషయాలపై అనేక పరిశోధనలు జరిపారు. వీరి పరిశోధనల్లో భాగంగా.. కొంతమంది స్త్రీ పురుషులను ఎంపిక చేసుకుని వారి బాహుమూలాల నుండి నమూనాలను సేకరించారు.

వీరి పరిశోధనల్లో సేకరించిన నమూనాల పరిశీలనలో తేలిన నిజం ఏంటంటే... మగువల శరీరం నుండి ఉల్లిపాయ లేదా ద్రాక్ష లాంటి పరిమళం వెదజల్లితే, మగవారి శరీరం నుంచి జున్ను సువాసనలు వెదజల్లుతున్నట్లు కనుగొన్నారు. మహిళల శరీరం నుండి వెలువడే వాసన వల్ల పక్కనున్న వారికి ఇబ్బంది కలిగిస్తుందని కూడా వీరు పసిగట్టారు.

ఈ పరిశోధనలకు నేతృత్వం వహించిన క్రిస్టియన్ స్టార్కెన్‌మన్ మాట్లాడుతూ... మహిళల నుండి తాము సేకరించిన నమూనాలలో వాసనలేని సల్ఫర్ సంబంధ రసాయనాల ఉనికిని గుర్తించినట్లు చెప్పారు. ఒక మిల్లీమీటర్ స్వేదం (చెమట)లో దాదాపు 5 మిల్లీగ్రాముల సల్ఫర్ సంబంధ పదార్థాలున్నట్లు తమ అధ్యయనంలో తేలిందన్నారు.

అదే పురుషుల స్వేదంలో అయితే.. ఎలాంటి వాసనల్లేని ఫ్యాటీ యాసిడ్‌లు ఉన్నట్లు గుర్తించామని స్టార్కెన్‌మన్ పేర్కొన్నారు. కానీ అవి చాలా తక్కువ మొత్తంలో అంటే మిల్లీలీటరు స్వేదంలో కేవలం 0.5 మిల్లీగ్రాములలోపే ఉన్నాయని చెప్పారు. ఇదిలా ఉంటే... రాబోయే కాలంలో శరీర దుర్వాసనను సమర్థవంతంగా ఎదుర్కొనేలా తయారు చేయబోయే ఉత్పత్తుల తయారీకి తమ పరిశోధనలు మార్గదర్శకం అవుతాయని స్టార్కెన్‌మన్ విశ్వాసం వ్యక్తం చేశారు.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
కన్నెపొరపై యువకులకు అపోహలు వద్దు
నీటి కాలుష్యంతో లైంగిక సామర్థ్యం ప్రశ్నార్థకం
ఊబకాయం పురుషుల్లో అంగ స్తంభనపై అపోహా!
సైన్స్ కంటే ఆర్ట్స్ అమ్మాయిలే బెటర్!
ప్రసవ తేదీకి ముందు "సెక్స్"
"ప్రోత్సాహం" రతి క్రీడకు ప్రధాన కారకం!