ఈ శీర్షిక చదివి ఆశ్చర్యం కలగక మానదు. సెక్స్ ఏంటి సర్వరోగనివారిణి అన్న విషయం కాస్త ఆశ్చర్యం వేసినా ఇది ముమ్మాటికీ నిజం అంటున్నారు వైద్యులు. ఇందులో పరిశోధకులు, వైద్యులు పరిశోధించి సెక్స్ అనేది సర్వరోగనివారిణి అని తేల్చి చెప్పారు. వైవాహిక జీవితంలో సెక్స్ అనేది ఒకరి సుఖ-దు:ఖాలు మరొకరు పంచుకోవడం, తమవారు అన్న మానసికమైన ఓ అనుభూతి వారిని మరింత దగ్గర చేస్తుందని, అలాగే వారి ఆరోగ్యంకూడా ఎంతో బాగుంటుందని పరిశోధకులు ధృవీకరించారు. సెక్స్ వల్ల శరీరంలో ఎన్నో హార్మోన్లు ఉత్పన్నమౌతాయని, అవి శరీర ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తాయని దీంతో అందంకూడా ఇనుమడిస్తుందని వారు అంటున్నారు. సెక్స్‌లో పాల్గొనడంతో ఆ దంపతుల్లో ఈస్ట్రోజెన్ హార్మోను ఉత్పత్తి అవుతుందని ఇది ఆస్టియోపోరోసిస్ అనే వ్యాధి బారిన పడకుండా చేస్తుంది. సెక్స్ చేయడం వల్ల శరీరంలో ఎండార్ఫిన్ హార్మోన్ వృద్ధి చేందుతుంది. ఇది చర్మ సౌందర్యాన్ని ఇనుమడింపజేస్తుంది. ఈస్ట్రోజెన్ హార్మోను మనిషిని ఆనందడోలికల్లో తేలియాడేలా వుంచుతుంది. ఇందులో ఉన్న ప్రత్యేకతే అది అంటున్నారు వైద్యులు. నియమానుసారం సెక్స్‌లో పాల్గొనే దంపతులు ఆరోగ్యంగా వుంటారు. వారి సౌందర్యం జీవితాంతం వుంటుంది. వారిలో ఉత్సాహం, ఆత్మవిశ్వాసంకూడా అధికంగా వుంటుందని పరిశోధకులు తెలిపారు. సెక్స్ నుండి దూరంగా వుండేవారు సిగ్గు, సంకోచం, అపరాధ భావం, తీవ్రమైన మానసిక ఒత్తిడితో బాధపడుతుంటారని పరిశోధనలు చెబుతున్నాయి. మనిషి తన మనస్సును ఆరోగ్యంగా వుంచడానికి, ఒత్తిడి నుంచి దూరంగా వుండడానికి సెక్స్‌ను నియమానుసారం అనుభవించాలని వైద్యులు సూచిస్తున్నారు. సెక్స్ చేసేటప్పుడు ఒకరకమైన ఫేరోమోన్స్ అనే రసాయనం శరీరంలో విడుదలవుతుందని ఇది ఒకరకమైన వాసనను పుట్టిస్తుంది. దీనిని సెక్స్ పెర్ఫ్యూమ్ అనికూడా అంటారు. ఈ సువాసన మనసుకు, మస్తిష్కానికి శుఖ-శాంతులను అందిస్తుంది.సెక్స్ అనేది హ్రుద్రోగం, మానసిక ఒత్తిడి, రక్తపోటు, గుండెపోటును నివారిస్తుంది. సెక్స్ అంటే భయపడేవారు ఈ జబ్బులతో సతమతమౌతారని పరిశోధకులు పేర్కొన్నారు. |