ప్రధాన పేజి > ఇతరాలు > ఆరోగ్యం > దాంపత్యం > లైంగిక జీవితంలో ప్రయోగాలు అవసరం
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
లైంగిక జీవితంలో ప్రయోగాలు అవసరం
WD
ఆనందానికి మూలం కొత్త అనుభవం. మొదటిసారిగా హిమాలయ పర్వతాలను ఎక్కినవారెవరైనా ఎగిరి గంతులేస్తారు. అలాగే తొలిసారిగా కారు నడిపినరోజు, తొలిసారిగా విమానం ఎక్కినపుడు ఏ వయసువారైనా ఉత్సాహంతో పొంగిపోతారు.

కొత్త చీర కట్టుకున్నప్పుడు, కోరుకున్న వస్తువు కొనుక్కున్నప్పుడు కలిగే భావం స్త్రీలందరికీ అనుభవమే. అదేవిధంగా తొలిప్రేమ, తొలిముద్దు, తొలిరాత్రి వగైరాలన్నీ మెదడులో అలాగే నిలిచిపోతాయి. కనుక సెక్స్ జీవితానికి మెదడు ప్రతిస్పందనలే కీలకం అని గ్రహించాలి.

తొలిరేయిలో కలిగిన ఆనందానుభూతులను మళ్లీ మళ్లీ తలచుకుని ఆనందంపడుతుంటారు చాలామంది. అలాగే ప్రియుడు/ప్రియురాలు రాసిన మొదటి ప్రేమలేఖను దాచిపెట్టుకుని మళ్లీమళ్లీ చదువుకునేవారు చాలామందే ఉంటారు.

ఇక యవ్వనంలోకి ప్రవేశించిన యువతీయువకులు తుళ్లిపడుతుంటారు. ఈ వయసులో వారిమధ్య సహజంగా పరస్పర ఆకర్షణ ఏర్పడుతుంది. ఆ ఆకర్షణ ప్రేమగా మారుతుంది. ఆ తర్వాత పెళ్లితో ఒకటైన యువతీయువకులు మధ్యవయసు వచ్చేసరికి నిట్టూర్పులు వదులుతుంటారు.
తొలిముద్దు.. తొలిరేయి... ఎంత తీపి
  తొలిప్రేమ, తొలిముద్దు, తొలిరాత్రి వగైరాలన్నీ మెదడులో అలాగే నిలిచిపోతాయి. కనుక సెక్స్ జీవితానికి మెదడు ప్రతిస్పందనలే కీలకం అని గ్రహించాలి      


పెళ్లికి ముందు ఎంతో శ్రద్ధగా అలంకరణ చేసుకునే అమ్మాయిలు పెళ్లై, పిల్లలు కలిగిన తర్వాత తమ అందం మీద అస్సలు శ్రద్ధే చూపరు. ఈ తేడా ఎందుకనే సందేహం చాలామందిలో కలుగుతుంది. అయితే అది మెదడు చూపే సహజమైన స్పందన.

చక్కని చీరకట్టుకుని పడకగదికి చేరిన భార్య, తన డ్రెస్‌ని ఒక్కొక్కటే తొలగిస్తూ భర్త చేసే శృంగారం, సెక్స్‌ని ఎంతో ఆనందిస్తుంది. ఆ తొలిరోజు అతిమధురంగా గడిచిపోతుంది. ఆ తర్వాత తొలినెల మధురంగా ఉంటుంది. ఆ తర్వాత అది క్రమంగా మామూలైన ఓ ప్రక్రియగా మిగులుతుంది.

ఒక అనుభవం నాలుగైదుసార్లు కలిగిన తర్వాత ఇక అందులో మెదడుకు కొత్తదనం కనిపించదు. అందుకే వాత్సాయనుడు లైంగిక జీవితంలో ప్రయోగాలు అవసరమన్నాడు. ఒకే భంగిమలో సెక్స్ ముగించే వారికి అది యాంత్రిక సెక్స్‌గా తయారవుతుంది.

కొత్త కొత్త భంగిమలలో పడక గదికి ఆవల, కొత్త ఊళ్లలో అలా సెక్సీ వేదికలను మార్చుకుంటుంటే ఆ కొత్త అనుభవాలను మెదడు మరింతగా ఆస్వాదిస్తుంది. సెక్స్ సుఖాన్ని ఓ స్వర్గంగా భావిస్తుంది. అందుకే రొటీన్ లైంగిక భంగిమలకు బ్రేక్ కొట్టి, నూతన భంగిమలను శోధించాలన్నాడు వాత్సాయనుడు.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
షుగర్ వ్యాధి ఉంటే సెక్స్‌లో విఫలమేనా...?
చైనాలో సెక్స్‌ పార్క్‌పై ఆందోళన !
సెక్స్‌లో చురుకుగా ఉండే తెలివిగల మహిళలు
గర్భధారణకు ఏ వయసు అనుకూలం?
స్త్రీ పురుషుల్లో లైంగికపరమైన అపనమ్మకాలు
రతి క్రీడకు "తొలిక్రీడ" ఎంతో ముఖ్యం