ప్రధాన పేజి > ఇతరాలు > ఆరోగ్యం > దాంపత్యం > "హస్త ప్రయోగం"తో "ప్రొస్టేట్ క్యాన్సర్" ముప్పు...!!
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
"హస్త ప్రయోగం"తో "ప్రొస్టేట్ క్యాన్సర్" ముప్పు...!!
FILE
నాకు చాలా సంవత్సరాలుగా హస్తప్రయోగం చేసే అలవాటుంది. దానివల్ల ఏమైనా దుష్ఫలితాలు ఉంటాయా, నేను సంసారానికి పనికివస్తానా... అంటూ చాలామంది సెక్సాలజిస్టుల వద్ద తమ గోడును వెల్లబోసుకోవడం మనకు తెలిసిందే. అయితే వీరి ప్రశ్నలన్నింటినీ ఓపికగా వినే సెక్సాలజిస్టులు మీకు వచ్చిన నష్టం, ప్రమాదం ఏమీ లేదని చెప్పేవారు.

పైగా అది ఆరోగ్యకరమైన లక్షణమేనని బల్లగుద్ది మరీ చెప్పేవారు. అయితే తాజా పరిశోధనా ఫలితాల వల్ల సెక్సాలజిస్టులు ప్రస్తుతం అలాంటి భరోసా ఇవ్వలేని సందిగ్ధంలో పడిపోయారు. ఎందువల్లనంటే, హస్తప్రయోగం ఎక్కువగా చేసుకునేవారు "ప్రొస్టేట్ క్యాన్సర్" వ్యాధి బారిన పడవచ్చునని పై అధ్యయనం ద్వారా వెల్లడైంది కాబట్టి...!

ఇరవై లేదా ముప్పైయేళ్ల వయసులో కోర్కెలతో విపరీతంగా రగిలిపోయేవారు ప్రొస్టేట్ క్యాన్సర్ బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని నాంటింగ్ హోం యూనివర్సిటీ పరిశోధకులు నిర్ధారించారు. మరీ ముఖ్యంగా ఇరవైలలో అధికంగా హస్తప్రయోగం చేసేవారిలో ఈ ప్రమాదం మరింత ఎక్కువగా ఉంటుందని వారంటున్నారు. ప్రొస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న కొన్ని వందలమంది రోగుల సెక్స్ అలవాట్లను అధ్యయనం చేసిన తరువాతనే ఈ నిర్ధారణకు వచ్చినట్లు పరిశోధకులు చెబుతున్నారు.

ఈ పరిశోధనలకు నేతృత్వం వహించిన డాక్టర్ పాలిక్సేని డిమిట్రో పౌలోవ్ మాట్లాడుతూ... ప్రొస్టేట్ క్యాన్సర్ వ్యాధి కారణాల్లో శరీరంలోని హార్మోన్లే ప్రధానమైనవని చెప్పారు. శరీరంలోని హార్మోన్లకు క్యాన్సర్ కణాలను ఉత్తేజపరిచే లక్షణం ఉందన్న భావనతో ఈ వ్యాధి చికిత్సలో భాగంగా శరీరంలోని హార్మోన్ల స్థాయిని నియంత్రిస్తామన్నారు.

అలాగే మనుషుల్లో సెక్స్ కోరికలు కలిగేందుకు కూడా ఈ హార్మోన్లే ప్రధాన కారణంగా ఉంటాయని పౌలోవ్ అన్నారు. కాబట్టి, ఎవరైనా తీవ్రమైన సెక్స్ కోరికలతో రగిలిపోతున్నారంటే, వారి శరీరంలో హార్మోన్ల స్థాయి చాలా ఎక్కువగా ఉందని అర్థం. దీనిని బట్టి, తీవ్రమైన సెక్స్ కోరికలు ప్రొస్టేట్ క్యాన్సర్‌కు కారణమవుతున్నట్లు స్పష్టమవుతోందని ఆయన వ్యాఖ్యానించారు.

తమ పరిశోధనల్లో భాగంగా... 60 సంవత్సరాలకన్నా తక్కువ వయసులోనే ప్రొస్టేట్ క్యాన్సర్ బారిన పడిన దాదాపు వెయ్యిమంది పురుషులను అధ్యయనానికి ఎంపిక చేసినట్లు పౌలోవ్ వివరించారు. వీరిలో దాదాపు 59 శాతం మంది యుక్త వయస్సులో నెలకు కనీసం 12 సార్లు శృంగారంలో పాల్గొనడం లేదా హస్తప్రయోగం చేసుకున్నట్లు వెల్లడైందన్నారు.

అధ్యయనంలో పాల్గొన్న పురుషుల వయసు పెరుగుదలతో పాటు, వారు సెక్స్‌లో పాల్గొనే లేదా హస్తప్రయోగం చేయడం కూడా క్రమంగా తగ్గిపోయినట్లు తాము గుర్తించామని పౌలోవ్ తెలిపారు. 30లలో 48 శాతం, 40లకి వచ్చేసరికి 28 శాతం, యాభైలలో 13 శాతానికి పడిపోయినట్లు ఆయన చెప్పారు.

అలాగే, ఆరోగ్యవంతులతో పోలిస్తే... ప్రొస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్నవారు పూర్వ జీవితంలో ఎక్కువసార్లు సుఖవ్యాధులతో బాధపడినట్లు కూడా తాము గుర్తించినట్లు పౌలోవ్ పేర్కొన్నారు. ఈ క్రమంలో క్యాన్సర్ బారిన పడిన పురుషులు, ఆరోగ్యవంతులతో పోలిస్తే... దాదాపు 10 శాతం అధికంగా హస్తప్రయోగం చేసినట్లు, సరాసరిన నెలకు 20 లేదా అంతకంటే, ఎక్కువసార్లు శృంగారంలో పాల్గొన్నట్లు తేలిందని డిమిట్రో పౌలోవ్ తెలియజేశారు.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
ఇష్టమైనవారితో ఫాంటసీ సెక్స్ అనారోగ్యమా...?
సెక్స్ పెద్ద ఎక్సర్‌సైజ్ అంటారు. నిజమేనా...?
షుగర్ వ్యాధి ఉన్నవారు రతిలో భార్యను తృప్తి పరచగలరా..?
శోభనం గుసగుసలు... శృంగార లేఖలు
ముద్దుల్లో రకాలు...!
గాళ్ ఫ్రెండ్/బాయ్ ఫ్రెండ్ ఉన్నారా? చెప్పొద్దు.. చెప్పొద్దూ...