పెరటి వైద్యం | వ్యాధి | కథనాలు | చిట్కాలు | హోమియోపతి | దాంపత్యం | మనస్తత్వ శాస్త్రం | వార్తలు | యోగాసనాలు | ఆయుర్వేదం | స్వైన్ ఫ్లూ
ప్రధాన పేజి » ఇతరాలు » ఆరోగ్యం » దాంపత్యం » "రతి క్రీడ"లో భార్యాభర్తలిద్దరూ గురుశిష్యులే!? (Sex | Wife&Husband | Nights | Youths |)
 
File
FILE
సాధారణంగా శారీరక లోపాలు ఉన్న యువతీ యువకులు సెక్స్‌లోని మజాను ఆస్వాదించలేక పోవచ్చు. కానీ, అన్నివుండీ, ఎలాంటి లోపం లేని జంటలు సెక్స్‌లో పాల్గొనకుండా తీవ్రమైన అసంతృప్తితో ఎన్నో రాత్రులు వెళ్లదీస్తున్నట్టు పలు సర్వేలు చెపుతున్నాయి.

సాధారణంగా.. జీవితంలో అవసరమైన అనేక అంశాలు పెద్దలు నేర్పితే నేర్చుకునేవే. నడక చేయి పట్టుకుని నేర్పించాలి. అన్న ఎలా తినాలో.. నీళ్లు ఎలా తాగాలో.. పెద్దలతో ఎలా నడుచుకోవాలో.. ఇలా ప్రతీది మన పెద్దల నుంచి నేర్చుకుంటాం.

అయితే, మానవ జీవితానికే అర్థంపరమార్థం కల్పించే రతి క్రీడను ఒకరు ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. సెక్స్ భంగిమల గురించి.. సెక్స్ అనుభవించే తీరుపై ఒకరు విడమర్చాల్చిన పని అంతకంటే లేదు. సెక్స్‌ అనుభవం అనేది ప్రతి వ్యక్తికి జన్యుపరంగానే వచ్చే లక్షణంగా చెప్పుకోవచ్చు.

ఇలాంటి సహజసిద్ధమైన ఆనందాన్ని అనుభవించడంలో లోపాలు ఎందుకు ఉత్పన్నమవుతున్నాయో ఎవరికీ అంతుచిక్కదు. సాధారణంగా.. సెక్స్‌ గురించి తెలుసుకునేందుకు ప్రతి యువతీ యువకులు తాము పెళ్లీడు కొచ్చినప్పటి నుంచే ఆసక్తి చూపుతారు. యువతులైతే.. పెళ్లి తర్వాత పూర్తిస్థాయిలో దీని గురించి తెలుసుకునేందుకు శ్రద్ధ చూపుతారు.

అయితే, సెక్స్‌ను అనుభవించే సమయంలో భార్యాభర్తలు లేదా యువతీయువకులిద్దరూ గురుశిష్యులతో సమానం. తమకు తెలిసిన రతి భంగిమలు చెప్పుకోవడం, సెక్స్‌పై అవగాహన పెంచుకునేందుకు ఇద్దరూ సిగ్గు విడిచి ముచ్చటించుకోవడం చేయాలి. ముఖ్యంగా, తమకు తెలిసిన మెళకువలను ఒకరికొకరు చెప్పుకునేందుకు ఏమాత్రం వెనుకంజ వేయరాదు.

అలాగే, చెప్పే విషయాన్ని శ్రద్ధగా నేర్చుకునేందుకు చొరవ చూపాలి. ఈ విషయంలోనే భార్యాభర్తలు గురుశిష్యులుగా మారాలి. ఈ అన్యోన్య ప్రేమే... తమ వైవాహిక జీవిత ఆనందాన్ని స్వర్గపుటంచుల వరకు చేర్చుతుందని నిర్భయంగా చెప్పొచ్చు.
• Play Free Online Games Click Here
• Blogs, Videos and More Click Here
• Send Musical and Animated Cards Click Here
• Simple,Fast & Free Email Service Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.