పెరటి వైద్యం | వ్యాధి | కథనాలు | చిట్కాలు | హోమియోపతి | దాంపత్యం | మనస్తత్వ శాస్త్రం | వార్తలు | యోగాసనాలు | ఆయుర్వేదం | స్వైన్ ఫ్లూ
ప్రధాన పేజి » ఇతరాలు » ఆరోగ్యం » దాంపత్యం » హస్త ప్రయోగం చేస్తే సన్నబడతారా? (Youth | Sex | Health | News | Doctors |)
 
File
FILE
యుక్త వయస్సుకు వచ్చే యువతీ యువకులకు కామవాంఛలు కలగడం సహజ లక్షణమని చెప్పుకోవచ్చు. ఈ విషయంలో యువతులు అంత తొందరగా బయట పడరు. కానీ.. యువకులు మాత్రం తాత్కాలికంగా తృప్తిని అనుభవించాలని పరితపిస్తారు. దీంతో హస్త ప్రయోగానికి అలవాటు పడతారు. ఆరంభంలో ఒకటి రెండు సార్లు మాత్రమే చేసే యువకులు కాలక్రమంలో నాలుగైదు సార్లుకు అలవాటు పడిపోతారు. దీనివల్ల కొంతమంది యువకులు నీరసపడి పోతుంటారు.

అయితే, ప్రతిరోజు హస్త ప్రయోగం చేయడం వల్ల సన్నబడి పోతామనే అపోహా పలువురిలో ఉంటుంది. ఇదేవిషయంపై వైద్యులను సంప్రదిస్తే మాత్రం వారి సమాధానం మరోలా ఉంటుంది. సాధారణంగా 95 శాతం మంది పురుషుల్లో హస్త ప్రయోగం అలవాటు ఉంటుందని అంటున్నారు. కొందరు రోజుకొకసారీ, మరికొందరు రోజుకు మూడు నాలుగుసార్లు.. ఇంకొందరు రెండు మూడు రోజులకు ఒకసారి ఇలా రకరకాలుగా అలవాటు ఉంటుంది.

ఒక విధంగా చెప్పాలంటే ఇది ఒక ఆరోగ్య లక్షణమని వైద్యులు అంటున్నారు. అయితే, యుక్త వయస్సులో కామకోర్కెలు కలగడం, వాటిని హస్త ప్రయోగం ద్వారా తీర్చుకోవడం సహజ లక్షణంగానే భావించాలని చెపుతున్నారు. ఇలా చేయడం వల్ల వీర్య కణాలు ఎక్కువగా పోతాయని, తద్వారా నీరసించి పోతారని, సన్నబడి పోతారనే అనుకోవడం కేవలం అపోహా మాత్రమేనట.

ఎన్ని సార్లు హస్త ప్రయోగం చేసినా.. ఎంత వీర్యం పోయినా యువకుడి ఆరోగ్యానికి కలిగే నష్టమేమీ లేదని వైద్యులు అంటున్నారు. లావుగా, సన్నగా ఉండటం అనేది యువకుని ఆరోగ్య లక్షణాలపై ఆధారపడి ఉంటుందని చెపుతున్నారు.

అదే యువతుల విషయానికి వస్తే యోనిలో చేతి వేలు పెట్టుకుని భావప్రాప్తి పొందుతారని వైద్యులు చెపుతున్నారు. ఇలా చేయడం వల్ల గోళ్లు పెద్దవిగా ఉంటే యోనిలో గుచ్చుకునే ప్రమాదం ఉందని వారు హెచ్చరిస్తున్నారు.
• Play Free Online Games Click Here
• Blogs, Videos and More Click Here
• Send Musical and Animated Cards Click Here
• Simple,Fast & Free Email Service Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.