పెరటి వైద్యం | వ్యాధి | కథనాలు | చిట్కాలు | హోమియోపతి | దాంపత్యం | మనస్తత్వ శాస్త్రం | వార్తలు | యోగాసనాలు | ఆయుర్వేదం | స్వైన్ ఫ్లూ
ప్రధాన పేజి » ఇతరాలు » ఆరోగ్యం » దాంపత్యం » సెక్స్ చేయడం తప్పని భావించే పురుషులు/ స్త్రీలు (Sex | couple | bed time | sex problems)
 
WD
జీవితంలో ఎన్నెన్నో ప్రయోగాలు చేసే స్త్రీ పురుషులు సెక్స్ విషయానికి వచ్చేసరికి... అదేదో చేయరాని పనిలా జంకుతుండటం కనబడుతుంటుంది. మరికొందరైతే అసలు సెక్స్ చేయడమే తప్పు అని భాగస్వామిని దూరంగా ఉంచుతారు. దీంతో పడక గది జైలులా మారిపోయి దాంపత్య సుఖం లేకపోవడంతో కొందరు విడాకులు తీసుకునేందుకు సిద్ధపడతారు. అయితే విడాకులకు కారణమైన ఈ అసలు సమస్యను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వెల్లడించరు.

దీనికి కారణం తరతరాలుగా స్త్రీ పురుషులు సెక్స్ గురించి మాట్లాడుకోవడం తప్పుగా భావించడమేనంటున్నారు సెక్సాలజిస్టులు. వివాహం కాక మునుపు సెక్స్ సంబంధిత అంశాలను తెలుసుకోని వారిలో ఎక్కువగా ఈ భావన ఉంటుందంటున్నారు. దీనితోపాటు సెక్స్ పట్ల విముఖతను కల్గించడానికి వేరే కారణాలు కూడా ఉండే అవకాశం ఉందంటున్నారు.

రతి అనేది కొందరి మహిళల మదిలో అది ఓ భయంకరమైన అనుభవం. ఇక మగవారి విషయానికి వస్తే... "సెక్స్"లో విఫలమైతే భార్య వద్ద లోకువవుతామనే సందేహం వారిని సెక్స్ చేయనీయదు. ఇటువంటి చిన్నచిన్న సమస్యలే చివరికి జంటలను విడదీస్తాయి. కనుక కొత్తగా పెళ్లైన ప్రతి జంట సెక్స్ సమస్యలు, సెక్స్‌పై ఉన్న అనుమానాలను నిర్భయంగా ఒకరికొకరు చర్చించుకోవడంతోపాటు, సమస్యను ఎలా అధిగమించాలో సంబంధిత వైద్యుడిని సంప్రదించాలి. అప్పుడే సెక్స్ జీవితం స్వర్గమయం అవుతుంది.
• Play Free Online Games Click Here
• Blogs, Videos and More Click Here
• Send Musical and Animated Cards Click Here
• Simple,Fast & Free Email Service Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.