పెరటి వైద్యం | వ్యాధి | కథనాలు | చిట్కాలు | హోమియోపతి | దాంపత్యం | మనస్తత్వ శాస్త్రం | వార్తలు | యోగాసనాలు | ఆయుర్వేదం | స్వైన్ ఫ్లూ
ప్రధాన పేజి » ఇతరాలు » ఆరోగ్యం » దాంపత్యం » షుగర్ వ్యాధి సెక్స్ సామర్థ్యానికి "గుదిబండ" (Diabetes | impact on sex power | tips | health | sex problems)
 
Sex
WD
మధుమేహం వుంటే సెక్స్ సామర్థ్యం ఎందుకు తగ్గిపోతుంది...? అంగ స్తంభనలు బలహీనంగా ఉంటాయా..? పురుషాంగం పటుత్వం కోల్పోతుందా...? అసలు మధుమేహం సెక్స్‌ సామర్థ్యంపై చూపే ప్రభావం ఏమిటి...? ఇది తెలియాలంటే, ఒక్కసారి లైంగిక క్రియా సమయంలో శరీరంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి.

రతికి సిద్ధమైన పురుషునిలో శృంగార భావనలు మెదడులో ఆరంభమవుతాయి. మెదడు శృంగార సంకేతాలను క్రమంగా జననాంగాలకు పంపించడం మొదలుపెడుతుంది. దీంతో పురుషాంగానికి అత్యంత వేగంగా రక్త సరఫరా జరుగుతుంది. ఈ క్రమంలో పురుషాంగానికి రక్తాన్ని తీసుకువచ్చే నాళాలన్నీ వెడల్పుగా పెద్దవిగా మారుతాయి. ఇలా పురుషాంగానికి రక్త సరఫరా జరిగే కొద్దీ అది క్రమేపీ స్తంభిస్తుంటుంది.

సెక్స్ కోరిక తీవ్ర స్థాయికి చేరుకోవడంతో పురుషాంగంలో ఒత్తిడి పెరిగి రక్తం తిరిగి వెళ్లే మార్గాలన్నీ తాత్కాలికంగా మూసుకుపోతాయి. అంగంలో రక్తం అలాగే ఉండిపోవడంతో స్తంభన అలాగే నిలిచి ఉంటుంది. సంభోగంలో స్ఖలనం అయిన తర్వాత తిరిగి మార్గాలన్నీ తెరుచుకుని పురుషాంగంలో చేరిన రక్తం వెనక్కి వెళ్లిపోతుంది. దీంతో అంగం మునుపటి స్థితికి చేరుకుంటుంది.

ఈ క్రియ మధుమేహ వ్యాధిగ్రస్తుల్లో సమర్థవంతంగా జరుగదు. షుగర్ వ్యాధిగ్రస్తుల్లో రక్త నాళాల గోడలకు క్యాల్షియం, కొవ్వు వంటివి పేరుకుపోతుంటాయి. దీనివలన రక్త నాళాల్లోని మార్గం బాగా సన్నబడిపోతుంది. ఫలితంగా పురుషాంగంలోకి ఎక్కువగా రక్తం సరఫరా అయ్యే అవకాశం ఉండదు. దీంతో పురుషాంగం స్తంభించే సామర్థ్యం తగ్గుతుంది.

అంతేకాదు మధుమేహాన్ని అశ్రద్ధ చేస్తే పురుషాంగంలోని సమీప నాడులు దెబ్బతిని ఫలితంగా శృంగారంలో తృప్తి లేకుండా పోతుంది. ఇది ఒక్క పురుషాంగం విషయంలోనే కాదు.. శరీరంలోని చాలా రక్త నాళాలు ఇలా సన్నగా మారిపోతాయి. మధుమేహం ఉన్నవారిలో హైబీపీ సమస్య ఉంటుంది. దీన్ని అదుపు చేసేందుకు వాడే మందులు సైతం సెక్స్ సామర్థ్యాన్ని తగ్గించే అవకాశం ఉంటుంది. కనుక మధుమేహాన్ని అదుపులో ఉంచుకుంటేనే రతి శక్తివంతంగా జరుపగలరు. ఫలితంగా భాగస్వామి తృప్తిపడుతుంది. లేదంటే బెడ్రూం శృంగారం నిస్సారంగా మారే ప్రమాదం ఉంటుంది.

మధుమేహం ఉన్నట్లు తెలిసిన తర్వాత పొగతాగటం, కాఫీ, మద్యం తాగటం వంటివన్నీ మానుకుంటే మంచిది. ముఖ్యంగా పొగతాగటం వల్ల రక్త నాళాలకు బాగా హాని జరిగే అవకాశం ఉంది. ఇది సెక్స్ సామర్థ్యంపై ప్రభావం చూపుతుంది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.