మహిళలను ఎక్కువగా అనారోగ్య సమస్యలు వెంటాడుతుంటాయి. ఈ సమస్యలన్నిటికీ దాంపత్య సుఖం చెక్ పెట్టేస్తుందని తాము చేసిన అధ్యయనంలో తేలిందని ఆస్ట్రేలియాకు చెందిన మానసికవేత్తల బృందం వెల్లడించింది. రోజులో ఒక్కసారి సెక్స్‌లో భావప్రాప్తిని పొందిన మహిళల్లో చాలామటుకు అనారోగ్య సమస్యలు తలెత్తవని తమ అధ్యయనంలో తేలిందంటున్నారు.
అధ్యయనంలో భాగంగా 25 నుంచి 60 ఏళ్ల మధ్యవయసున్న 300 మంది మహిళలపై పరిశోధనలు చేశారు. ఈ అధ్యయనంలో ప్రతిరోజూ ఒక్కసారి భావప్రాప్తి సుఖాన్ని అనుభవించినవారిలో అనారోగ్య సమస్యలు దాదాపుగా కనిపించలేదు. అదేసమయంలో వారానికి ఒకటి రెండుసార్లు, లేదంటే నెలకు రెండు మూడుసార్లు సెక్స్‌లో భావప్రాప్తిని అనుభవించేవారిలో అనారోగ్య సమస్యలు ఉన్నట్లు కనుగొన్నారు.
వారానికి ఒకటి రెండుసార్లు మాత్రమే సెక్స్‌లో పాల్గొంటున్నవారు తమ దాంపత్య జీవితం చప్పగా ఉండటానికి కారణాలు వివరించారు. అధ్యయనంలో పాల్గొన్నవారిలో 50 శాతం మహిళలు తమతమ జీవిత భాగస్వాములు తీవ్రంగా అలసిపోయి.. ఇంటికి వస్తారనీ, సెక్స్ చేయకుండా ఏవేవో కబుర్లు చెపుతూ నిద్రలోకి జారిపోతారని వాపోయారు. ఆ పరిస్థితుల వలన తమ సెక్స్ జీవితం నిస్సారంగా మారుతోందని చెప్పారు.
మరో 10 శాతం మంది స్త్రీలు... ఒకవేళ తమ భాగస్వామి నిరాసక్తత కనబరిచినా, అతడిని ఉద్రేకపరచటం ద్వారా సెక్స్ సుఖాన్ని అనుభవిస్తున్నట్లు చెప్పారు. మిగిలిన 40 శాతం స్త్రీలు తాము ప్రతిరోజూ సెక్స్‌లో పాల్గొనకుండా ఉండమనీ, ఒకవేళ తాము మిస్ చేసినా తమ భాగస్వామి ఆ పనిని సమర్థవంతంగా పూర్తి చేస్తాడని వెల్లడించారట. కనుక ఆ 40 శాతం మంది స్త్రీలు బాగా చురుకుగా, ఆరోగ్యంగా ఉన్నట్లు తమ అధ్యయనంలో తేలిందని అధ్యయనకారులు వెల్లడించారు.