పెరటి వైద్యం | వ్యాధి | కథనాలు | చిట్కాలు | హోమియోపతి | దాంపత్యం | మనస్తత్వ శాస్త్రం | వార్తలు | యోగాసనాలు | ఆయుర్వేదం | స్వైన్ ఫ్లూ
ప్రధాన పేజి » ఇతరాలు » ఆరోగ్యం » దాంపత్యం » ఆనందంగా రతిక్రయలో పాల్గొనాలంటే...! (Happy | Body | Sex | Thinking | Positiveness | Researchers | Centre For Sexual health Promotion)
 
FILE
రతిక్రియలో ఆనందంగా పాల్గొనాలంటే ముందు మీ శరీరం సహకరించాలి. దీనికి మీరు చేయాల్సిందల్లా ఒక్కటే... శరీరం మీకు సహకరిస్తుంది అని అనుకోవడం, సానుకూల దృక్పథంతో ఆలోచించాలి. ఇలా ఆలోచించినప్పుడే మీకు మీ శరీరం సహకరించి మహదానందంగా రతిక్రియలో పాల్గొంటారంటుని పరిశోధనలు వెల్లడించాయి. ముఖ్యంగా మహిళలు సానుకూల దృక్పథంతో ఆలోచిస్తే భలే రంజుగా ఉంటుందంటున్నారు పరిశోధకులు,

మహిళలు చాలామంది తమలో రతిక్రియ జరిపే శక్తి లేదని అనుకుంటూనే కాలం వెళ్ళబుచ్చుతుంటారని, ఇది చాలా తప్పుడు ఆలోచన అని పరిశోధకులు చెపుతున్నారు. రతిక్రియలో ఆనందంగా పాల్గొనాలంటే ముందుగా మీ శరీరాన్ని సిద్ధం చేయాలి. దీంతోపాటు సానుకూల దృక్పథంతో ఆలోచించాలని సెంటర్ ఫర్ సెక్సువల్ హెల్త్ ప్రమోషన్‌కు చెందిన పరిశోధకులు తెలిపారు.

ఎవరైతే సానుకూలంగా ఆలోచిస్తారో అలాంటి వారు రతిక్రియలో మహారంజుగా పాల్గొంటారని, వీరు క్రమంగా తమ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకునేందుకు ప్రయత్నిస్తారని పరిశోధకులు వెల్లడించారు.
FILE


సాధారణంగా మహిళలు తమ శరీరంపట్ల అనురక్తి కలిగి ఉండరు. దీంతో వారిలో రతిక్రియలో పాల్గొనాలనే కోరిక చచ్చిపోతుంటుంది. అదే పురుషులైతే దీనికి విరుద్ధంగా ఆలోచిస్తారని సెంటర్ ఫర్ సెక్సువల్ హెల్త్ ప్రమోషన్‌ పేర్కొంది. తాము నిర్వహించిన సర్వేలో దాదాపు 362 మంది మహిళలు, 241 మంది పురుషులు పాల్గొన్నారని, వీరిలో 18 నుంచి 23 సంవత్సరాల వయసు కలిగినవారున్నారని సంస్థకు చెందిన డేబీ హర్బనిక్ తెలిపారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.