పెరటి వైద్యం | వ్యాధి | కథనాలు | చిట్కాలు | హోమియోపతి | దాంపత్యం | మనస్తత్వ శాస్త్రం | వార్తలు | యోగాసనాలు | ఆయుర్వేదం | స్వైన్ ఫ్లూ
ప్రధాన పేజి » ఇతరాలు » ఆరోగ్యం » దాంపత్యం » భారతీయులకు సెక్స్ పట్ల అవగాహన తక్కువే...! (Indians | Condoms | Durex | Survey | Sex Knowledge)
Feedback Print Bookmark and Share
 
FILE
దేశంలోని దాదాపు 41 శాతం భారతీయులకు అధికారిక రతిక్రియలో వారికి ప్రేమ, గౌరవంతోపాటు ఆనందం తక్కువేనని కండోమ్‌ల నిర్మాణ రంగంలో అగ్రగామిగానున్న కంపెనీ డ్యూరెక్స్ వెల్లడించింది.

డ్యూరెక్స్ కండోమ్ కంపెనీ నిర్వహించిన సర్వేననుసరించి భారతీయులకు సెక్స్ పరిజ్ఞానం చాలా తక్కువని తెలిపింది. దీనికిగాను వారికి సెక్స్ ఎడ్యుకేషన్ గురించి తెలపాలని ఆ సంస్థ పేర్కొంది. సెక్స్ పరిజ్ఞానం ఉన్నవాళ్ళే అందులోనున్న సుఖాన్ని అనుభవిస్తున్నట్లు తమ సర్వేలో తేలిందని ఆ సంస్థ తెలిపింది.

దేశంలోని చాలామంది తమకు మరింత సెక్స్ పరిజ్ఞానం కలిగివుంటే మరింత ఆనందించేవారమని, తమకు సెక్స్ పరిజ్ఞానం గురించి తెలుసుకునేందుకు తాము తమ మిత్రులపై ఆధారపడుతామని, వారుకూడా తమ వయస్కులవారే కాబట్టి వారికి తోచిన సలహాలతోనే తాము జీవితాన్ని నెట్టుకొస్తున్నట్లు తెలిసిందని సర్వే నిర్వహించిన సంస్థ తెలిపింది.

డ్యూరెక్స్ సంస్థ ప్రతి సంవత్సరం సెక్స్ ఆరోగ్యంపై ప్రపంచవ్యాప్తంగా సర్వేలు నిర్వహించి సెక్స్ పరిజ్ఞానం పెంపొందించుకునేందుకు తగిన సూచనలు చేస్తుంటుంది. ఇందులో భాగంగానే ఈ ఏడాది నిర్వహించిన సెక్స్ పరిజ్ఞానంపై నిర్వహించిన సర్వేలో భారతీయులకు సెక్స్ పరిజ్ఞానం తక్కువని రుజువైనట్లు పేర్కొంది.
FILE


తాము నిర్వహించిన సర్వేననుసరించి భారతీయులకు దాదాపు 59 శాతం తమ మిత్రులనుంచి సెక్స్ పరిజ్ఞానం గురించిన విషయాలను తెలుసుకుంటుంటారని తేలినట్లు సంస్థ తెలిపింది. ఆ తర్వాతి స్థానాన్ని పత్రికలు అందుకున్నాయని డ్యూరెక్స్ సంస్థ తెలిపింది.

ప్రస్తుతం సెక్స్ పరిజ్ఞానం కొరకు ఇంటర్నెట్ సహాయం కూడా తీసుకుంటున్నట్లు తెలిసింది.

సర్వేలోని ప్రధాన విషయాలు:

** దేశంలోని ప్రతి పదిమందిలోంచి కేవలం నలుగురికి మాత్రమే స్కూల్ ద్వారా సెక్స్ పరిజ్ఞానం లభించింది.

** 18 శాతంమంది తమ తల్లిదండ్రులనుంచి సలహాలు తీసుకున్నారు.
FILE


** 58 శాతం గర్భధారణ గురించి తెలుసుకున్నారన్నారు.

** సెక్స్‌లో కలిగే తృప్తి, భావప్రాప్తి గురించి కేవలం 30 శాతం మందికి మాత్రమే తెలుసునని, వారి అనుభూతికి అవధులు లేవని వారు పేర్కొన్నట్లు సర్వే నిర్వహించిన సంస్థ డ్యూరెక్స్ కండోమ్స్ సంస్థ వెల్లడించింది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.