పెరటి వైద్యం | వ్యాధి | కథనాలు | చిట్కాలు | హోమియోపతి | దాంపత్యం | మనస్తత్వ శాస్త్రం | వార్తలు | యోగాసనాలు | ఆయుర్వేదం | స్వైన్ ఫ్లూ
ప్రధాన పేజి » ఇతరాలు » ఆరోగ్యం » దాంపత్యం » నీరుల్లి తిన్నరోజు "మొదటి రాత్రి" అనుభవమే!! (Sex power | Fresh Onion | clove | ginger | tomato | radish | celery | pepper | pistachio nut)
Feedback Print Bookmark and Share
 
WD
దాంపత్య సుఖాన్ని పూర్తి స్థాయిలో అనుభవించలేకపోతున్నామనే జంటలు రానురాను పెరుగుతున్నట్లు పలు సర్వేలు చెపుతున్నాయి. దీనికి కారణం సెక్స్ సామర్థ్యాన్ని పెంపొందింపజేసే ఆహారపదార్థాలను తీసుకోకపోవడం. ప్రస్తుతం చాలామంది ఫ్యాషన్ తిళ్లకు అలవాటై ఏ పిజ్జా కార్నర్లోనూ తమ నోటికి పనిచెప్పి ఇంటికెళ్లి "గుర్రు" పెట్టి నిద్రపోవడం అలవాటైపోయింది. దీంతో పడక గది జీవితం నిస్సారమైపోతున్నది.

ఈ సమస్యను అధిగమించడానికి కొందరు రకరకాల పద్ధతులను ఆశ్రయిస్తుంటారు. సెక్స్ సామర్థ్యం కోసం పలు రకాల మందులను సేవిస్తూ ఉంటారు. కానీ అటువంటివన్నీ ప్రక్కనపెట్టి సహజసిద్ధంగా మనకు లభించే ఆహారపదార్థాలను తీసుకుంటుంటే ఈ సమస్యను అధిగమించవచ్చంటున్నారు సెక్సాలజిస్టులు.

అటువంటి ఆహారపదార్థాలు ఏమిటో వారు ఉదహరించారు. నీరుల్లిపాయలు, పెరుగు తోటకూర, లవంగ, అల్లం, టమేటో, ముల్లంగి, పుదీనా, కోడిగ్రుడ్లు, క్యారెట్, మిరియాలు, పిస్తా పప్పు, కొబ్బరి, దొండకాయలు వంటివాటికి సెక్స్ సామర్థ్యాన్ని పెంపొందిచగల గుణముంది. కనుక తీసుకునే ఆహారంలో వీటికి చోటిస్తే పడక గది జీవితం స్వర్గమవుతుందంటున్నారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.