పెరటి వైద్యం | వ్యాధి | కథనాలు | చిట్కాలు | హోమియోపతి | దాంపత్యం | మనస్తత్వ శాస్త్రం | వార్తలు | యోగాసనాలు | ఆయుర్వేదం | స్వైన్ ఫ్లూ
ప్రధాన పేజి » ఇతరాలు » ఆరోగ్యం » దాంపత్యం » కామ సూత్రాలు ఎందుకు? (Kama Sutra | Happy life | Men and Women | Sex)
Feedback Print Bookmark and Share
 
FILE
సెక్స్ అనేది మానవ జీవితంలో విడదీయరాని ఒక భాగం. స్త్రీ, పురుషుల మధ్య సంబంధాలను గురించి కృత్రిమంగా ఆలోచించకూడదు. ఈ సంబంధాన్ని బట్టే మానవ జీవితం రూపుదిద్దుకుంటుంది. ఆహారం, నిద్ర సమస్త ప్రాణులకు సహజమైనట్లే, మానవ జీవితంలో అతి ప్రధానమైన సెక్స్ కూడా సహజమైనదే.

అటువంటి ఈ సుఖాన్ని ఎంతమాత్రం నిరాదరణకు గురిచేయడానికి వీలు లేదు. అయితే, ఆత్మ నిగ్రహం, ఆత్మ విచారం ఈ రెండూ వుండి కామ సుఖం అనుభవించినప్పుడే దానికి సార్థకత. దీని గురించి డాక్టర్లకు, మానసిక వైద్యులకు.. తెలుసు. మరి సామాన్య మానవుని సంగతి ఏమిటి?

వీరికి కూడా తెలియజెప్పేందుకే ప్రాచీన భారతీయులు కామశాస్త్రాన్ని గురించి నిష్పక్షపాతంగా చర్చించి, దీనిని కూడా ఒక కళగా ఆరాధించారు. లైంగిక సంబంధమైన ఎన్నో రహస్యాలను తెలుసుకున్నారు. దీనిని ప్రకృతి ధర్మంగా భావించి ఆచరించారు. అంతేతప్ప ఇది ఒక అశ్లీలతగా, ఒక అసభ్యకరమైన విషయంగా వారు పరిగణించలేదు. సెక్స్‌తో జీవితం మరింత సుఖమయంగా, ఆనందమయంగా ఉంటుందని నొక్కి వక్కాణించారు.

"కామ్యతే సర్వేతితి కామం" అని వ్యుత్పత్తి. అందరిచేత అభిలషించబడేది కామం. స్త్రీ, పురుషులలో కలిగే సంభోగాభిలాష కామమే. అసలు ఈ కోరిక ఏమిటని ఆలోచించిన మహర్షులకు సృష్టి రహస్యం అవగతమైంది. ఒక్కడుగా వున్న విరాట్ పురుషుడి వలన ఈ విశాల విశ్వాన్ని సృష్టించడం వీలు కాదు. కేవలం ఒక స్త్రీ వల్ల సృష్టి జరుగదు.

రెండుగా చీలిన విత్తనం నుంచి చెట్టు ఎలా మొలకెత్తదో... అలాగే కేవలం పురుషుడి వల్ల లేదా కేవలం స్త్రీ వల్ల సృష్టి జరుగదు. ఈ విషయాన్ని తెలుసుకున్న అతడు మరో దానికోసం ఆరాటపడ్డాడు. తన దేహాన్నే రెండు భాగాలు చేశాడు. ఆ రెండింటికే మిథునమని పేరు. వారే దంపతులు. వారి మైథున క్రియ మూలంగా సృష్టి ఆరంభమైంది.

ఈ మైథున క్రియ ఎలా ఆచరించాలని చెప్పేందుకే కామ శాస్త్రం ఆవిర్భవించింది. కాలం మారినా, మనుషులు మారినా, ఆచారాది వ్యవహారాలు మారిపోయినా ఈ కాలంలో కూడా ఆచరించదగినవి కామ సూత్రాలు. స్త్రీ, పురుష లైంగిక సంబంధమైన విషయాలను పూర్వం గోష్టులుగా చెప్పుకునేవారట. కానీ నేడు సెక్స్ అనేది విచ్చలవిడిగా వెర్రితలలు వేస్తూ అనేక వికృత రూపాలలో సాక్షాత్కరిస్తున్నది.

కానీ కామశాస్త్రం చక్కగా అవగతం చేసుకుని ఆచరించేవారికి అది శృంగార రస సాగరంలో ఓలలాడిస్తూ సుఖప్రద జీవన యాత్ర సాగించేందుకు సహాపడుతుంది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.