పెరటి వైద్యం | వ్యాధి | కథనాలు | చిట్కాలు | హోమియోపతి | దాంపత్యం | మనస్తత్వ శాస్త్రం | వార్తలు | యోగాసనాలు | ఆయుర్వేదం | స్వైన్ ఫ్లూ
ప్రధాన పేజి » ఇతరాలు » ఆరోగ్యం » దాంపత్యం » రోజూ ఒకే రకమైన రొమాంటిక్ కెమిస్ట్రీనా... "బోర్ బోర్" (Sex life | Mind | Brain | First love | First kiss | First night)
Feedback Print Bookmark and Share
 
WD
తొలిచూపు.. తొలిప్రేమ... తొలిరాత్రి. ఇవన్నీ ఎంతో తీయగా తలచుకునే కొలదీ మధురాతిమధురంగా ఉంటాయి. అయితే ఈ మధురానుభవాల నుంచి కొత్త కోణాలను వెదుక్కోక పోతే రొమాంటిక్ కెమిస్ట్రీ రియాక్ట్ అవుతుందంటున్నారు బెడ్రూం రొమాన్స్ పై అధ్యయనం చేసిన పరిశోధకులు.

మానవుని మెదడు విచిత్రమైన గుణాన్ని కలిగి ఉన్నట్లు వారు కనుగొన్నారు. అదేమంటే... మెదడు ఎప్పటికప్పుడు కొత్తదనం కావాలని ఆరాటపడుతుందట. తొలిప్రేమనాటి తొలిముద్దు ఎంత తీయగా ఉన్నప్పటికీ అదే ముద్దును తిరిగి రుచి చూపిస్తూ ఉంటే మెదడు "బోర్ బోర్" అని గోలపెడుతుందట. అందువల్లనే మనిషి ఎప్పటికప్పుడు కొత్త రకం సరసరసాలను కనుగొని అందులో ఓలలాడుతుంటాడని వెల్లడించారు.

ఇక పడకగది జీవితానికి వస్తే... ప్రేయసీప్రియులిద్దరూ ఆలుమగలై తొలిరేయి నాడు గడిపిన క్షణాలు మత్తులోకి తీసుకెళ్లడం ఖాయం. అయితే అదే భంగిమ కొన్నాళ్లకు బోర్ కొడుతుంది. కొత్తదనపు అనుభవం కావాలని ఆరాటపడుతుంది. దీంతో సదరు భర్త/భార్య తనపై ప్రేమ తగ్గిపోయిందని బహిరంగంగానే ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధించుకుంటారు. నిజానికి ఇక్కడ వారి శృంగార జీవితాన్ని నడిపించేది మెదడు.

ఆ శృంగారపు మెదడుకు పాత చింతకాయ పచ్చడి భంగిమల పట్ల వెగటుపుడుతుంది. కొత్త భంగిమలను శోధించమని అడుగుతుంది. మెదడు సంకేతాలను గ్రహించి అలా నడుచుకునే జంటల శృంగారం స్వర్గంలా ఉంటుందని వెల్లడించారు శోధకులు. మైండా..! మజాకా...!!
సంబంధిత సమాచారం కోసం శోధించండి.