పెరటి వైద్యం | వ్యాధి | కథనాలు | చిట్కాలు | హోమియోపతి | దాంపత్యం | మనస్తత్వ శాస్త్రం | వార్తలు | యోగాసనాలు | ఆయుర్వేదం | స్వైన్ ఫ్లూ
ప్రధాన పేజి » ఇతరాలు » ఆరోగ్యం » దాంపత్యం » అది ఇప్పుడు కాదన్నానా..! వెళ్లవయ్యా... వెళ్లూ!! (Sex | Men and Women | Husbands | no sex)
Feedback Print Bookmark and Share
 
WD
పడకగదిలో శృంగారానికి చాలామంది పడతులు విముఖత చూపుతున్నట్లు తాజా సర్వేలో వెల్లడైంది. అర్థరాత్రి, అపరాత్రి అనే బేధం లేకుండా గంటలకు గంటలు బయటే గడుపుతున్న భర్తలను భార్యలు అనుమానంగా చూస్తున్నారట. దీంతో రాత్రికి ఇంటికి వచ్చిన భర్తను నిరభ్యంతరంగా ఆ సుఖానికి దూరంగా ఉంచుతున్నారట. మరీ గట్టిగా అడిగితే... తనకు తలనొప్పిగా ఉందనీ... "ఇప్పుడు కాదు డార్లింగ్" అని ఎంతో ప్రేమగా వారిస్తున్నారట.

పని గంటలు పెరిగి సతమతమవుతున్న సదరు భర్తలకు ఇది కొత్త తలనొప్పిగా మారినట్లు ఐఐపీఎస్ సంస్థకు చెందిన బృంద సభ్యులు వెల్లడించారు. సుమారు 70 నుంచి 80 శాతం నెలలో రెండు మూడు రోజులు తప్పించి దాంపత్య సుఖానికి ప్రాముఖ్యత ఇవ్వడం లేదని సర్వేలో వెల్లడైంది.

ఇదిలావుంటే... ప్రతి 20మంది మగాళ్లలో ఒకరు అక్రమ సంబంధాన్ని కలిగి ఉన్నట్లు ఆ సర్వేలో వెలుగు చూడటం గమనార్హం. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాలలో ఈ సంఖ్య అధికంగా ఉన్నట్లు తేలింది. అదేవిధంగా సుమారు ఆరు శాతం పురుషులు సెక్స్ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని సర్వే నిర్వహించిన బృంద సభ్యులు వెల్లడించారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.