ప్రధాన పేజి » ఇతరాలు » ఆరోగ్యం » స్వైన్ ఫ్లూ » స్వైన్ ఫ్లూ అంటే ఏమిటి? ఎలా వస్తుంది? (Swine flu | Virus | pigs |)
 
File
FILE
స్వైన్ ఫ్లూ (Swine flu) లేదా స్వైన్ ఫ్లూయంన్జా (Swine influenza) ఇదో రకం వైరస్. దీన్నే హెచ్1ఎన్1గా పిలుస్తారు. పందులలో సంక్రమించే శ్వాసకోశ సంబంధిత వ్యాధి. పందుల్లో కూడా ఈ వ్యాధి వైరస్ ద్వారానే వ్యాపిస్తుంది. సాధారణంగా ఈ వైరస్ మనుషులకు సంక్రమించడం బహు అరుదు. పందుల ద్వారా సంక్రమించే ఈ వ్యాధిని అంటురోగంగా వ్యాపిస్తోంది.

దీంతో ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తోంది. ఈ యేడాది మార్చి నెలాఖరు, ఏప్రిల్ మొదటిలో దక్షిణ కాలిఫోర్నియాలో మరియు సేన్ ఏంటోనియా, టెక్సాస్ దగ్గర తొలిసారిగా స్వైన్ ఇన్ ఫ్లూయెన్జా (హెచ్1ఎన్1) వైరస్ ద్వారా మానవ అంటువ్యాధి కేసు నమోదైంది. ఇతర మెక్సికో, అమెరికా సంయుక్త రాష్ట్రాలతో పాటు... ప్రపంచంలోని అనేక దేశాలకు ఈ వ్యాధి వ్యాపించింది.

ఈ వ్యాధి లక్షణాలు ఏమిటి!
మనుషులలో వచ్చే స్వైన్ ఫ్లూ వైరస్ లక్షణాలు సాధారణంగా వచ్చే ఫ్లూని పోలి ఉంటాయి. ప్రధానంగా.. జ్వరం, జలుబు, వాంతులు, దగ్గు, గొంతు నొప్పి, ఒంటి నొప్పులు, తల నొప్పి, చలి, శ్వాస పీల్చడం కష్టంగా ఉండటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొంత మందికి అతిసారవ్యాధి మరియు స్వైన్ ఫ్లూతో వచ్చే వాంతులు వచ్చేవిధంగా ఉంటుంది. ఈ వైరస్ సోకిన రోగికి వ్యాధికి శ్వాస పీల్చడం చాలా కష్టంగా మారుతుంది. సీజనల్ ఫ్లూ వలె స్వైన్ ఫ్లూ అవసరమైన దీర్ఘకాల ఆరోగ్య పరిస్థితులను క్షీణించేలా చేస్తుంది.

అంటువ్యాధిగా స్వైన్ ఫ్లూ...
స్వైన్ ఫ్లూను ఒక అంటువ్యాధిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. ఈ వ్యాధికి ఐదో ప్రమాదకర సూచీ సంఖ్యను వెల్లడించింది. హెచ్1ఎన్1 వైరస్ లక్షణాలు కలిగిన రోగి.. దగ్గడం లేదా తుమ్మడం ద్వారా మరో వ్యక్తికి ఇది వ్యాప్తి చెందుతుంది. ఒక్కొక్క సారి.. ఈ వ్యాధి సోకిన రోగిని తాకినా, ముక్కును లేదా నోటిని పట్టుకున్నా.. ఈ వైరస్ సోకే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

వ్యాధి లక్షణాలు కనిపించడం మొదలు పెట్టిన ఒకరోజు ముందు మరియు వ్యాధి సోకిన ఏడు రోజులు వరకు లేదా అంతకన్నాఎక్కువ రోజుల్లో సంబంధిత రోగి నుంచి మరో వ్యక్తికి వైరస్ సోకే ప్రమాదం ఉంది. అంటే మీకు వ్యాధి సోకిందని తెలిసే మునుపే లేదా మీరు వ్యాధిగ్రస్థులైన తర్వాత కూడా ఇతరులకు ఈ వైరస్‌ను సోకించవచ్చు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.