ప్రధాన పేజి » ఇతరాలు » ఆరోగ్యం » స్వైన్ ఫ్లూ » పెద్దలు.. పిల్లల్లో కనిపించే వ్యాధి లక్షణాలు (Swine flu | Childrens | Parents |)
 
File
FILE
స్వైన్ ఫ్లూ వ్యాధి వయస్సుతో నిమిత్తం లేకుండా చిన్నాపెద్ద అనే తేడా లేకుండా సోకుంది. అయితే, వ్యాధి లక్షణాలు మాత్రం పెద్దల్లో ఒకరకంగానూ, పిల్లల్లో మరోలా కనిపిస్తాయని వైద్యులు చెపుతున్నారు.

పెద్దవారిలో కష్టంగా శ్వాస తీసుకోవడం లేదా కొద్దిగా శ్వాస తీసుకోవడం, ఛాతీలో లేదా పొత్తికడుపులో నొప్పి లేదా వత్తిడి కలిగినట్టు ఉండటం, ఆకస్మికంగా తల తిరగడం, తికమకగా ఉండడం. తీవ్రమైన లేదా నిరంతరాయంగా వాంతులు, విరేచనాలు వస్తాయి.

అలాగే, వైరస్ సోకిన చిన్నారులు.. వేగంగా శ్వాస పీల్చలేక పోవడం లేదా అతికష్టం మీద శ్వాస పీల్చడం. చర్మం నీలిరంగులోకి మారడం. పాలు ఇతర ద్రవ పదార్థాలు చాలినంతగా తీసుకోలేక పోవడం, చికాకు ప్రదర్శించడం, జ్వరం, దగ్గు విపరీతంగా రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాలు కనిపిస్తే తక్షణం వైద్యులను సంప్రదించి సరైన చికిత్స తీసుకోవడం మంచిది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.