ప్రధాన పేజి » ఇతరాలు » ఆరోగ్యం » స్వైన్ ఫ్లూ » ప్రాథమిక దశలో ఇంటిలోనే చికిత్స (Swine flu | Virus | pigs |)
 
File
FILE
ఫ్లూ మహమ్మారి కావడంతో.. ఆరోగ్య కేంద్రాల్లో బాగా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో.. ఈ వ్యాధికి ఇంటి వద్ద చికిత్స తీసుకునే అవకాశాలను కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ వివరించింది.

వ్యాధి సోకిన తరువాత స్వల్ప అనారోగ్యంతోనే బాధపడుతుంటే.. రోగులకు ఇంటివద్దే చికిత్స అందించవచ్చు. వీరికి కూడా గుర్తింపు పొందిన వైద్య నిపుణుడే చికిత్స అందించాలి. పరిస్థితి విషమించిన సమయంలో లేదా ప్రమాద సంకేతాలు వచ్చిన సమయంలో రోగిని ఆస్పత్రికి తీసుకెళ్లాలి.

ప్రమాదకర సంకేతాలు ఏమిటంటే.. బాగా బలహీనత లేదా నిలబడలేని స్థితి, అపస్మారక స్థితి, శక్తిహీనత, శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు, ద్రవాహారాలు తీసుకోలేని స్థితి, అధికస్థాయిలో జ్వరం.

ఇంట్లో ఇచ్చే చికిత్సా పద్దతిని పరిశీలిస్తే.. రోగికి పూర్తి విశ్రాంతి ఇవ్వడంతోపాటు, జ్వరానికి సంబంధించిన మందుల వాడాలి. మంచి ఆహారం ఇస్తూ ఇతర వ్యక్తులకు రోగిని దూరంగా ఉంచాలి. అయితే ఇవన్నీ సుశిక్షితుడైన వైద్యుని పర్యవేక్షణలోనే జరగాలి.

రోగి పర్యవేక్షణకు ఉంచిన వ్యక్తి తరుచుగా చేతులు కడుక్కోవాలి. ఇంటిలోని ఉపరితలాన్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ ఉండాలి.

రోగి సంరక్షణను చూసే వ్యక్తి కంటే ముఖ్యంగా రోగి మాస్కు ధరించి ఉండాలి. ఈ మాస్కును రోజు మొత్తం ధరించి ఉండాల్సిన అవసరం లేదు. అయితే రోగి కోసం ఏర్పాటు చేసిన సంరక్షుడు దగ్గరికి వెళ్లే సమయంలో మాత్రం మాస్కు ధరించాలి.

మాస్కులు లభ్యతలో ఉంటే, సంరక్షకులు కూడా అవి ధరించవచ్చు. కిటికీలు తెరిచి ఉంచాలి. రోగి ఉన్న గదిలోకి గాలి, వెలుతురు బాగా రావాలి.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.