స్వైన్ ఫ్లూపై పోరాడేందుకు, దానిని నిరోధించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. ముఖ్యంగా పేద ప్రాంతాల్లో, సరైన వైద్య సదుపాయాలు లేని ప్రదేశాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించింది.
వ్యాధి సోగిన రోగులకు దూరంగా ఉండటం, వారి పీల్చుకొని, వదిలేగాలికి, వాడే వస్తువులకు దగ్గరగా ఉండకుండా చూసుకోవడం, ఇంటిలో గాలివెలుతురు చక్కగా ఉండేలా చూసుకోవడం ద్వారా వ్యాధి వెంటనే ఇతరులకు వ్యాపించకుండా అడ్డుకోవచ్చు.
ఇతరులకు కనీస దూరం పాటించడం మంచిది. ముఖ్యంగా గుంపుల్లో ఉండటం తగ్గించుకోవాలి. నోటికి, ముక్కుకు మాస్కులు ధరించడం మంచిది.
బహిరంగ ప్రదేశాల్లో సంచరించే సమయంలో రోజూ మాస్కు ధరించాలి. అయితే దీని ద్వారా వ్యాధిని పూర్తిగా నిరోధించవచ్చని చెప్పలేము.