ప్రధాన పేజి » ఇతరాలు » ఆరోగ్యం » స్వైన్ ఫ్లూ » స్వైన్ ఫ్లూ వ్యాధికి విరుగుడు తిప్పతీగ...! (Swain Flu | Tippa Teega | Yoga | Ramdev baba | Ayurveda)
 
FILE
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న స్వైన్ ఫ్లూ మహమ్మారి బారినపడకుండా ఉండేందుకుగాను తిప్పతీగను ప్రతి రోజు వాడొచ్చని ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా అన్నారు.

ప్రాణాంతకమైన స్వైన్ ఫ్లూ మహమ్మారిని అడ్డుకునేందుకు ఆయుర్వేదం ద్వారా ప్రయత్నించవచ్చని, ఇందులో భాగంగా తిప్పతీగను ప్రతి రోజు సేవించడం వలన మనిషి శరీరంలో రోగ నిరోధక శక్తి బలపడుతుందని ఆయన న్యూ ఢిల్లీలో తెలిపారు.

తిప్పతీగ రసాన్నిగాని లేదా కాండాన్నిగాని తులసి రసంతో కలిపి సేవించాలి. అలాగే ప్రస్తుతం ఎవరైతే ఈ వ్యాధిబారిన పడి అల్లోపతి మందులు ఇదివరకే వాడుతుంటే వీటితోపాటు తిప్పతీగను వాడొచ్చని ఆయన పేర్కొన్నారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.