స్వైన్ ఫ్లూ వ్యాధి: దేశంలో ప్రధాన ఆసుపత్రుల వివరాలు
FILE
దేశంలో రోజురోజుకూ విస్తరిస్తోన్న స్వైన్ ఫ్లూ మహమ్మారి అనేకమంది ప్రాణాలను బలిగొంటోంది. ఇప్పటికే ఈ వ్యాధి బారినపడి 12 మంది మృతి చెందగా.. తాజాగా ఈ వ్యాధితో బాధపడుతున్న పుణెకి చెందిన ఓ మహిళ, మహారాష్ట్రకు చెందిన మరో వ్యక్తి మృత్యువాత పడ్డారు. దీంతో ఈ మాయదారి రోగం బారినపడి మృతి చెందిన వారి సంఖ్య బుధవారం నాటికి 14కు చేరింది.
దేశంలో ఇప్పటిదాకా 864 స్వైన్ ఫ్లూ కేసులు నమోదు కాగా... ఒక్క పుణేలోనే అత్యధికంగా 221 మంది ఈ వ్యాధి బారిన పడినట్లు తాజా గణాంకాలు చెబుతున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనలతో బెంబేలెత్తిపోగా... ప్రభుత్వం కూడా దీనిని తీవ్రంగానే పరిగణించి తగిన చర్యలు తీసుకుంటోంది. ఉచితంగానే వైద్య పరీక్షలు చేస్తూ, మందులను కూడా అందిస్తోంది. ఈ నేపథ్యంలో దేశంలోని వివిధ నగరాలలో స్వైన్ ఫ్లూ వ్యాధికి వైద్యం చేసే వివిధ ఆసుపత్రుల వివరాలను వెబ్‌దునియా పాఠకుల కోసం అందజేస్తున్నాం.
గుర్‌గావ్, ఢిల్లీ : ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అన్సారీ నగర్, అరబిందో మార్గ్ రింగ్ రోడ్, న్యూఢిల్లీ-29 ఫోన్ నెంబర్లు : (001) 26594404, 26861698. ప్రొఫెసర్ ఆర్.సి. డెకా : 09868397464
నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కమ్యూనికబుల్ డిసీజస్ 22, శ్యామ్‌నాథ్ మార్గ్, న్యూఢిల్లీ-54. ఫోన్ నెంబర్లు : (001) 23971272, 060, 344, 524, 449, 326.
డాక్టర్ రామ్ మనోహర్ లోహియా హాస్పిటల్ ఖరక్ సింగ్ మార్గ్, న్యూఢిల్లీ-01. ఫోన్ నెంబర్లు : (001) 23741640, 23741649, 23741639. డాక్టర్ ఎన్.కె. చతుర్వేది : 09811101704.
వల్లభాయ్ పటేల్ చస్ట్ ఇనిస్టిట్యూట్ యూనివర్సిటీ ఎన్‌క్లేవ్, న్యూఢిల్లీ-07. ఫోన్ నెంబర్లు : (001) 27667102, 27667441, 27667667, 27666182.
ముంబయి : కస్తూరిబా గాంధీ హాస్పిటల్ ఆర్థర్ రోడ్, ఎన్.ఎం. జోషి మార్గ్, జాకోబ్ సర్కిల్, ముంబై-11 ఫోన్ నెంబర్లు : (022) 23083901, 23092458, 23004512.
శ్రీ జేజే హాస్పిటల్ జేజే మార్గ్, బైకుల్లా, ముంబై-08. ఫోన్ నెంబర్లు : (022) 23735555, 23739031, 23760943, 23768400, 23731144, 23735555, 23701393, 23701366.
హఫ్‌కిన్ ఇనిస్టిట్యూట్ ఆచార్య దోండే మార్గ్, పెరల్ ముంబై-12 ఫోన్ నెంబర్లు (022) 24160947, 24160961, 24060962.