ప్రధాన పేజి » ఇతరాలు » ఆరోగ్యం » స్వైన్ ఫ్లూ » బాలీవుడ్‌లోను స్వైన్ ఫ్లూ ప్రభావం...! (Bollywood | Shooting | Studio | Film | Movie | Swine flu | serial | Pune | karan jauhar | kurban)
 
FILE
స్వైన్ ఫ్లూ మహమ్మారి ప్రభావం బాలీవుడ్‌‌పైనా పడింది. దీంతో బాలీవుడ్‌లోని చాలా స్టూడియోలలో పలు సినిమా, టీవీ సీరియళ్ళ షూటింగులు నిలిచిపోయాయి.

ప్రస్తుతం ప్రంపచాన్నే గడగడలాడిస్తున్న స్వైన్ ఫ్లూ మహమ్మారి ఇప్పుడు భారతదేశంలోను విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో ముఖ్యంగా మహారాష్ట్రలో ఈ వ్యాధిబారిన పడినవారి సంఖ్య ఎక్కువగానే ఉంది. దీంతో నటీ నటులుకూడా స్వైన్ ఫ్లూ వ్యాధికి భయపడి షూటింగులకు రాకుండా తప్పించుకుంటున్నారు.

ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు కరణ్ జోహర్ తీస్తున్న " కుర్బాన్ " చిత్రం షూటింగ్ ఆగస్టు నెల ఏడున పూనాలో జరగాల్సి ఉంది. కాని దర్శకుడు ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్‌ను ఓ నెలపాటు పొడిగించారు.

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... తమ యూనిట్‌లో దాదాపు 180 మంది పని చేస్తుంటారని వారి ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని తాను షూటింగ్ వాయిదా వేసినట్లు కరణ్ తెలిపారు. ప్రస్తుతం పూణె ప్రాంతం షూటింగ్‌కు అనుకూలంగా లేదని ఆయన అభిప్రాయపడ్డారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.