ప్రధాన పేజి » ఇతరాలు » ఆరోగ్యం » స్వైన్ ఫ్లూ » స్వైన్ ఫ్లూ వీరవిహారం: జాగ్రత్తలు తప్పనిసరి (Swine flu | virous | vaxin | Cold | Cough | infection | mask | respiretor |)
 
FILE
** మీ పిల్లలకు జలుబు, దగ్గు ఉంటే వారిని పాఠశాలకు పంపకండి.

** ఎవ్వరికీ షేక్ హ్యాండ్ ఇవ్వకండి. కౌగలించుకోకండి (హగ్ చేసుకోకండి).

** జనాభా రద్దీగా ఉండే ప్రాంతాలలో ఉమ్మకండి.

** దగ్గు, జలుబు కారణంగా తుమ్మలు వచ్చినప్పుడు నోటికి, ముక్కుకు రుమాలు లేదా టిష్యూ పేపర్ లాంటిది అడ్డుపెట్టుకోండి.

** టిష్యూ పేపర్‌ను వాడేటట్లైతే ఒకసారి వాడిన టిష్యూ పేపర్‌ను మరలా వాడకండి. మీరు వాడే రుమాలును ప్రతి రోజు సబ్బుతో ఉతకండి. శుభ్రంగా ఉండేందుకు ప్రయత్నించండి.

** దగ్గినా, తుమ్మినా లేదా బయటి ప్రాంతం నుంచి ఇంట్లోకి ప్రవేశించిన తర్వాత తప్పనిసరిగా మీ చేతులు, ముఖం, కాళ్లు సబ్బుతో కడుక్కోండి.

** మీ కళ్ళు, ముక్కు, నోటిని చేతులతో తాకకండి. మీ చేతులలో వైరస్ ఉంటే శరీరంలోకి ప్రవేశించే అవకాశాలున్నాయంటున్నారు వైద్యులు.

** ఎవరైతే శ్వాసకోశ సంబంధిత వ్యాధితో బాధపడుతుంటారో, అలాంటివారి వద్దకు వెళ్ళకండి. ఒకవేళ వారితో మాట్లాడాల్సి వస్తే రుమాలు లేదా మాస్క్ ధరించి వారితో సంభాషణ చేయాలంటున్నారు వైద్యులు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.