స్వైన్ ఫ్లూ వైరస్ నిరోధక వ్యాక్సిన్ వల్ల మనిషి మెదడుకు హాని కలుగుతుందని బ్రిటన్ న్యూరోలజిస్టులు హెచ్చరిస్తున్నారు. దీంతో వ్యాధి సోకిన కేసుల గురించి ఆరా తీయాల్సిందిగా ఆ దేశ వైద్య నిపుణులను బ్రిటన్ ప్రభుత్వం ఆదేశించింది. 1976లో అమెరికాలో స్వైన్‌ఫ్లూ వ్యాక్సిన్ వినియోగించిన 25 మంది గుల్ల్లైన్ బర్రే సిండ్రోమ్ వ్యాధి కారణంగా మరణించినట్టు ఆ సంస్థ ఆ లేఖలో పేర్కొంది.
తాజాగా, స్వైన్ ఫ్లూ కోసం రూపొందించిన కొత్త వ్యాక్సిన్ పరీక్షలు సంతృప్తికరంగా బ్రిటన్ వైద్యులు పేర్కొంటున్నారు. ఈ వ్యాక్సిన్ ప్రభావం పిల్లలపై ఏ తీరులో ఉందో ఇప్పటికీ తెలియదని ఆ సంస్థ వివరించింది. ఈ వ్యాక్సిన్‌ని విడుదల చేసే ముందు తగినన్ని ప్రయోగాలు జరుపలేదని పేర్కొన్నారు.
ఈ వ్యాక్సిన్‌ని వాడిన వారిలో కనిపించే లక్షణాలపై తగిన అధ్యయనం జరుగలేదని ఆ సంస్థ ప్రతినిధి తెలిపారు. అందువల్ల ఈ వ్యాక్సిన్‌పై పూర్తిస్థాయిలో నిర్థారణ పరీక్షలు జరిపిన తర్వాతే రోగులకు ఉపయోగించాలని కోరారు. అలాకాని పక్షంలో ఈ వ్యాక్సిన్ ఉపయోగించినట్టయితే మెదడుపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉన్నట్టు ప్రతినిధి వెల్లడించారు.