ప్రధాన పేజి » ఇతరాలు » ఆరోగ్యం » స్వైన్ ఫ్లూ » భారత్‌లోని నేతలకు స్వైన్‌ఫ్లూ లక్షణాలు (India | Swain Flu | Political Party Leders | Delhi | Haryana | Haryana Janhit Congress Party)
 
FILE
ప్రస్తుతం భారతదేశంలోని పలు ప్రాంతాలలో విజృంభిస్తున్న మహమ్మారి స్వైన్‌ఫ్లూ వ్యాధికారక వైరస్ పలువురు రాజకీయ ప్రముఖులకు కూడా సోకినట్లు వార్తలు వెలువడ్డాయి. వివిధ పనుల కారణంగా ఢిల్లీ చేరుకున్న ఈ రాజకీయ నాయకులలో కొందరికి సంబంధిత వ్యాధికారక క్రిములు వ్యాపించినట్లు వైద్యులు భావిస్తున్నారు.

హర్యానా రాష్ట్రానికి చెందిన హర్యానా జనహిత్ కాంగ్రెస్ అగ్రనేత, ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి భజన్ లాల్ కుమారుడు కులదీప్ బిష్ణోయ్‌కు స్వైన్‌ఫ్లూ లక్షణాలు కనిపించడంతో ఆయన రక్త, శ్వాస నమూనాలను సేకరించి పరీక్షల నిమిత్తం ప్రయోగశాలకు పంపినట్లు వైద్యులు తెలిపారు.

ఇదిలావుండగా ప్రస్తుతం ఆయనకు ప్రత్యేకంగా వైద్యుల పర్యవేక్షణలో వైద్య సేవలు అందిస్తున్నారు. కాగా మరికొంతమంది కాంగ్రెస్ పార్టీకి చెందిన అగ్రనేతలతోపాటు పలు పార్టీలకు చెందిన మరికొందరు నాయకులకు కూడా స్వైన్‌ఫ్లూ వైరస్ సోకినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నట్లు సమాచారం.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.